Gold and Silver Price Today: స్వల్పంగా తగ్గిన పసిడి.. పరుగులు పెడుతున్న వెండి..ప్రధాన నగరాల్లో నేటి ధరలు

|

Feb 21, 2022 | 6:48 AM

Gold and Silver Price Today: బంగారం విలువైన లోహం.. భారతీయులకు బంగారానికి విడదీయరాని బంధం ఉంది. ఒకప్పుడు ఆస్తిగా భావించే ఈ బంగారం ఇప్పుడు పెట్టుబడి గా కూడా మారింది..

Gold and Silver Price Today: స్వల్పంగా తగ్గిన పసిడి.. పరుగులు పెడుతున్న వెండి..ప్రధాన నగరాల్లో నేటి ధరలు
Follow us on

Gold and Silver Price Today: బంగారం విలువైన లోహం.. భారతీయులకు బంగారానికి విడదీయరాని బంధం ఉంది. ఒకప్పుడు ఆస్తిగా భావించే ఈ బంగారం ఇప్పుడు పెట్టుబడి గా కూడా మారింది. ముఖ్యంగా 2001 నుండి బంగారం పెట్టుబడిలో దాదాపు 15% వృద్ధిని సాధించింది.  పండుగలు, ఫంక్షన్ల సమయంలో మహిళలు అలంకరించుకునే బంగారం పెట్టుబడిదారులకు కూడా దీర్ఘకాలిక రాబడికి మూలంగా మారింది. బంగారాన్ని ఇష్టపడే దేశం అయిన భారతదేశం ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో    రెండవ స్థానాన్ని ఆక్రమించింది.  అయితే బంగారం రేట్లు ద్రవ్యోల్బణం అంతర్జాతీయంగా ధరలు మార్పు, కేంద్ర బ్యాంకుల బంగారం రిజర్వ్, వడ్డీ రేట్లు నిలకడలేని, నగల మార్కెట్లు సహా అనేక అంతర్జాతీయ అంశాలపై ప్రభావం ఇవి గ్లోబల్ గోల్డ్ రేట్లు ఆధారపడి ఉంటుంది.

ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలని భావించే వినియోగదారుల కోసం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశంలోని వివిధ ముఖ్య నగరాల్లో నేటి బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

హైదరాబాద్ లో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ గ్రాము ధర ఆదివారం రూ5,019లు ఉండగా సోమవారం  ఉదయానికి ఒక్క రూపాయి మేర తగ్గి రూ. 5,018లకు చేరుకుంది. 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.50,190లు ఉంది. అయితే ఈరోజు రూ. 10 లు మేర తగ్గడంతో  ఫిబ్రవరి 21 తేదీ సోమవారం  ఉదయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 50,180లు గా నమోదైంది.

ఇక నగలకు ఉపయోగించే 22 క్యారెట్ల  గ్రాము  బంగారం ధర ఆదివారం రూ. 4,600లు ఉండగా ఈరోజు ఉదయానికి (ఫిబ్రవరి 21 తేదీ సోమవారం ఉదయానికి) ఒక్క రూపాయితగ్గడంతో ఈరోజు గ్రాము బంగారం ధర రూ.4,599 లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో 10గ్రాముల బంగారం ధర సోమవారం ఉదయానికి రూ. 46,000ఉండగా.. నేడు పది రూపాయలు మేర తగ్గి 45,990లకు చేరుకుంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నం, వరంగల్  ల్లో కూడా కొనసాగుతున్నాయి.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,990గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,180గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,990గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,180గా ఉంది.

బంగారంతో పాటు వెండిని కూడా పెట్టుబడిగా భావిస్తుండడంతో .. వెండి కూడా రోజు రోజుకీ డిమాండ్ పెరుగుతుంది. దీంతో వెండి ధరల్లో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయానికి వెండి ధరలు స్వల్పంగా పెగింది. దేశంలో వెండి ధర రూ.700 మేర పెరిగింది. దీంతో మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.70,000 గా ఉంది. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కేజీ వెండి ధర రూ.70,000గా ఉంది.  ఆర్ధిక రాజధాని ముంబై, దేశరాజధాని ఢిల్లీలో రూ. కిలో వెండి ధర రూ. 64,00గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు సూచిక , GST, TCS ఇతర చార్జీలను కలిగి ఉండవు. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక ఆభరణాల వ్యాపారిని సంప్రదించి కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read:  ఈరోజు ఈ రాశివారికి అనుకులంగా ఉంటుంది. నేటి రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..