Gold Price Today: గోల్డ్‌ లవర్స్‌కి పండగలాంటి వార్త.. భారీగా తగ్గిన గోల్డ్‌ రేట్‌. ఈ మధ్య ఇంతలా తగ్గడం ఇదే తొలిసారి.

మొన్నటి వరకు ఓ రేంజ్‌లో దూసుకుపోయిన బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన మూడు రోజులుగా ప్రతీ రోజూ గోల్డ్‌ రేట్స్‌ తగ్గుతున్నాయి. తులం బంగారం రూ. 60 వేలు దాటేస్తోందని అందరూ అనుకుంటున్న సమయంలో తగ్గుదున్న ధరలు ఉపశమనం కల్పిస్తున్నాయి....

Gold Price Today: గోల్డ్‌ లవర్స్‌కి పండగలాంటి వార్త.. భారీగా తగ్గిన గోల్డ్‌ రేట్‌. ఈ మధ్య ఇంతలా తగ్గడం ఇదే తొలిసారి.
Gold Price

Updated on: Feb 17, 2023 | 6:28 AM

మొన్నటి వరకు ఓ రేంజ్‌లో దూసుకుపోయిన బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన మూడు రోజులుగా ప్రతీ రోజూ గోల్డ్‌ రేట్స్‌ తగ్గుతున్నాయి. తులం బంగారం రూ. 60 వేలు దాటేస్తోందని అందరూ అనుకుంటున్న సమయంలో తగ్గుదున్న ధరలు ఉపశమనం కల్పిస్తున్నాయి. శుక్రవారం తులం గోల్డ్‌పై ఏకంగా రూ. 430 వరకు తగ్గడం విశేషం. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. ఈరోజు గోల్డ్‌, సిల్వర్‌ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,880 ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730 ఉంది.

* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,600 ఉంది.

* బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,780గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730 ఉంది.

* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730 ఉంది.

* విశాఖటపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730 ఉంది.

వెండి ధరల్లో భారీ తగ్గుదుల..

ఇక వెండి ధరల్లోనూ భారీగా తగ్గుదుల కనిపించింది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఈ రోజు వెండి ధరలు తగ్గాయి. కిలో వెండి ధరపై ఏకంగా రూ. 950 తగ్గడం విశేషం. దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 69,000కాగా, ముంబైలో రూ. 69,000 , బెంగళూరులో రూ. 71,800 , చెన్నైలో రూ. 71,800 గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 71,800 విజయవాడలో, విశాఖపట్నంలో రూ. 71,800 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us