బంగారం ధరలు మళ్లీ నెమ్మదించాయి. గత కొద్దిరోజులుగా పెరుగుతూపోతున్న పసిడి ధరలకు కొంచెం బ్రేక్ పడింది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. అయితే తగ్గుదల పెద్దగా లేకపోయినప్పటికీ, బంగారం ప్రియులకు మాత్రం కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయం అని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సోమవారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,490గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,520 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 66,340కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,370 వద్ద కొనసాగుతోంది.
* చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,940గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ఊ. 73,030 వద్ద కొనసాగుతోంది.
* బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,340గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,370గా ఉంది.
* హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,340గా ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 72,370 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,340గా ఉండగా, 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ. 72,370గా ఉంది.
* విశాఖపట్నంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 66,340వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,370గా ఉంది.
వెండి కూడా బంగారం బాటలోనే పయణిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబయి, కోల్‌కతా, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 91,900 వద్ద కొనసాగుతుండగా, హైదరాబాద్, చెన్నై, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 96,400 వద్ద కొనసాగుతోంది.