ఏదో ఒక సమయంలో ప్రతీ ఒక్కరికి రుణం అవసరం పడుతుంది. అయితే లోన్ పొందాలంటే ఎన్నో రకాల డ్యాక్యుమెంట్స్, నెలవారీ ఆదాయం వంటివి ఉండాలి. సిబిల్ స్కోర్, అంతకుముందు తీసుకున్న లోన్ చెల్లించిన తీరు ఆధారంగా మనం రుణం పొందొచ్చు. అయితే ఇవేవి లేకుండా అత్యవసర సమయంలో రుణం పొందడానికి కూడా కొన్ని మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా సింపుల్‌గా రుణం ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
* మీకు ఒకవేళ కారు ఉన్నట్లైతే కారును కుదువ పెట్టి లోన్ తీసుకోవచ్చు. మీరు కారు విలువలో 50 శాతం నుంచి 200 శాతం వరకు లోన్ పొందొచ్చు. కారు లోన్ తీసుకుంటే 10 నుంచి 22 శాతం వరకు వడ్డీరేటు లభిస్తుంది. కారు లోన్ తీసుకుంటే పెద్దగా సిబిల్ స్కోర్‌ను కూడా పరిగణలోకి తీసుకోరు. మీ కారు మంచి బ్రాండ్‌కు చెందినది అయితే, రీసేల్ వాల్యూ ఎక్కువగా ఉంటే ఎక్కువ మొత్తం లోన్ పొందొచ్చు.
* ఒకవేళ మీకు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నా ఈజీగా రుణం పొందొచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్‌లపై కూడా సులభంగా లోన్ తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న రుణాలపై వడ్డీ రేటు 50 నుంచి 200 బేసిస్ పాయింట్లు అధికంగా ఉంటుంది. మీరు డిపాజిట్ చేసిన మొత్తం 70 నుంచి 90 శాతం వరకు లోన్ పొందొచ్చు. ఎలాంటి క్రెడిట్ హిస్టరీ, ఎలాంటి డ్యాక్యుమెంట్స్ లేకుండానే రుణం పొందొచ్చు.
* బంగారం కుదువ పెట్టుకొని కూడా లోన్ పొందొచ్చు. దీనిపై బ్యాంకులు 8 నుంచి 24 శాతం మేర వార్షిక వడ్డీ వసూలు చేస్తుంటాయి. బంగారంపై గరిష్టంగా రూ. కోటిన్న వరకు లోన్ పొందొచ్చు.
* లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీతో కూడా లోన్ పొందొచ్చు. మీ పాలసీ సరెండర్ విలువలో 85 నుంచి 90 శాతం వరకు లోన్ పొందొచ్చు. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఇలాంటి రుణాలు అందిస్తాయి. అయితే పాలసీ ఆధారంగానే రుణాలు ఇస్తారు.
* ఇక భూములను కుదువ పెట్టి కూడా లోన్ పొందొచ్చు. దీనిపై వార్షిక వడ్డీ రేటు 8.50 నుంచి 18 శాతం వరకు ఉంటుంది. మీ ఆస్తి విలువలో 60 నుంచి 70 శాతం మేర రుణాన్ని పొందొచ్చు. హోమ్ లోన్ మాదిరిగానే డాక్యుమెంటేషన్ ఉంటుంది, కానీ ప్రాసెసింగ్ సమయం తక్కువగా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..