గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు దేశాలు!

ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా వార్‌ ఎఫెక్ట్‌తో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. సామాన్యుడిపై ధరాభారం పెరిగిపోతోంది. ఒక్కొక్కటీగా పెరుగుతున్న రేట్లు ప్రజలకు చుక్కలు చూపెడుతున్నాయి. ఎల్‌పీజీ-సీఎన్‌జీ-క్యాబ్స్-ఆటోలు-ఫ్లయిట్ టిక్కెట్లు-పెళ్లిళ్ల ఖర్చులు, వంట నూనెలు-డ్రైఫ్రూట్స్ అన్నింటి ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఒకటేమిటి సమస్తం ఇకపై మిడిల్ క్లాస్‌పై భారం పడుతోంది. హోటల్స్‌లో పుడ్ లేదు.. హాస్టలర్లకు కష్టాలు తప్పటం లేదు. చివరకు IPLకు వార్ దెబ్బ తగిలింది. గ్యాస్ లెక్క తేలితేనే IPL ఖరారు అంటున్నారు. 28 నుంచి లెక్కప్రకారం షెడ్యూల్. కానీ, హోటళ్ల క్రైసిస్‌తో అయోమయం నెలకొంది.

గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు దేశాలు!
Gas Crisis Spreads Worldwide

Edited By:

Updated on: Mar 14, 2026 | 9:09 AM

ఇది ఆల్‌మోస్ట్ లాక్‌డౌనే. కరోనా మహమ్మారొక్కటే లేదంతే. మన దగ్గర మరీ అంత సిచ్యుయేషన్ లేదు గానీ.. కొన్ని దేశాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్‌ను సీరియస్‌గా అప్లై చేస్తున్నారు. హాలిడేస్ ఇచ్చేస్తున్నారు స్కూళ్లు కాలేజీలకు రావొద్దని. వియత్నాంలో పెట్రోల్, డీజిల్ సేవ్ చేయడానికి ఉద్యోగులను, సాధారణ ప్రజలను కూడా ఇంట్లోనే ఉండాలని చెప్పింది. యూరప్ కంట్రీస్ కూడా గ్యాస్ వినియోగాన్ని తగ్గించేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయించే ఆలోచనలో ఉన్నాయి. బంగ్లాదేశ్.. ఆల్రడీ కరెంట్‌ను ఆదా చేయడానికి, రోడ్లపై జనం తిరగడాన్ని తగ్గించడానికి విద్యా సంస్థలన్నిటికీ హాలిడేస్ ఇచ్చింది. పాకిస్తాన్ కూడా.. పెట్రోల్, డీజిల్ అయిపోతోందని రెండు వారాల పాటు స్కూళ్లు మూసేయాలని ఆదేశించింది. పాక్‌లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అమలవుతోంది. ఫిలిప్పీన్స్.. గవర్నమెంట్ ఆఫీసులలో వారానికి నాలుగు రోజులే పని చేయాలనే ఆర్డర్స్ ఇవ్వబోతోంది. థాయిలాండ్‌దీ అదే దారి. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించడానికి గవర్నమెంట్ ఉద్యోగులు ఇంటి నుండే పని చేయాలని ఆదేశాలిచ్చింది. దోశ ఏం పాపం చేసిందో గానీ.. దాన్ని కట్ చేస్తున్నాయి హోటల్స్. బెంగళూరు నుంచి ఢిల్లీ వరకు ఇదే సిచ్యుయేషన్. మంగళగిరిలో చిన్న చిన్న కాకా హోటళ్లు మూతపడుతున్నాయ్. గ్యాస్ ఉన్న వాళ్లు మాత్రం హోటల్ రన్...

Loading...
Unable to load recommendations.
Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి