Fuel Price: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయి? అధికంగా ఎక్కడ ఉంది?

Fuel Price: భారతదేశం వద్ద ప్రస్తుతం సుమారు 76 నుండి 80 రోజుల వరకు చమురు అవసరాలకు సరిపడా ముడి చమురు నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. అందువల్ల ఈ సమయంలో దేశ చమురు సరఫరా గురించి ఎలాంటి ఆందోళనలు లేవు..

Fuel Price: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయి? అధికంగా ఎక్కడ ఉంది?
Petrol, Diesel Price

Updated on: Jul 05, 2026 | 7:33 AM

Fuel Price: భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ప్రధాన మెట్రో నగరాల్లో స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గిన కారణంగా ఇటీవలి హెచ్చుతగ్గుల తర్వాత రేట్లు పెద్దగా మార్పు లేకుండా కొనసాగుతున్నాయి.

  • ఈరోజు ఢిల్లీలో పెట్రోల్ లీటరుకు రూ.102.12, డీజిల్ లీటరుకు రూ. 95.20 ఉంది.
  • ముంబైలో పెట్రోల్ లీటరుకు రూ.111.21, డీజిల్ లీటరుకు రూ.97.83 ఉంది.
  • కోల్‌కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.113.51 కాగా, లీటరు డీజిల్ ధర రూ. 99.82గా ఉంది.
  • చెన్నైలో పెట్రోల్ లీటరుకు రూ. 107.77, డీజిల్ లీటరుకు రూ. 99.55 వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

  • హైదరాబాద్‌లో పెట్రోల్ లీటరుకు రూ. 115.69, డీజిల్ లీటరుకు రూ. 103.82 ఉంది.
  • విజయవాడలో పెట్రోల్ సుమారు రూ.117.25, డీజిల్ రూ.104.96గా ఉంది.

ఈ ధరలు రాష్ట్ర పన్నులు, లోకల్ ఫ్యాక్టర్లతో కలిపి ఉన్నాయి. హైదరాబాద్‌లో అత్యధిక ధరలు నమోదవుతున్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. అయితే ప్రాంతాను బట్టి పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో తేడా ఉండవచ్చని గమనించండి.

ధరలపై ప్రభుత్వం ఏం చెప్పింది?

పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించడం సాధ్యం కాదని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టంగా తెలిపారు. ప్రస్తుతం పెట్రోల్ పంపుల్లో అమ్ముడవుతున్న పెట్రోల్, డీజిల్‌ను సుమారు రెండు నెలల క్రితం భారత రిఫైనరీలు కొనుగోలు చేసిన ముడి చమురుతో తయారు చేశారని ఆయన వివరించారు. ఆ సమయంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు అధికంగా ఉన్నాయి. ముడి చమురు ధర ఎక్కువగా ఉండటంతో పాటు, బీమా, రవాణా ఖర్చులు కూడా పెరిగాయి. అందువల్ల ప్రస్తుతం ఈ ఖరీదైన చమురు భారాన్ని చమురు కంపెనీలే భరిస్తున్నాయని తెలిపారు.

భారతదేశం వద్ద ప్రస్తుతం సుమారు 76 నుండి 80 రోజుల వరకు చమురు అవసరాలకు సరిపడా ముడి చమురు నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. అందువల్ల ఈ సమయంలో దేశ చమురు సరఫరా గురించి ఎలాంటి ఆందోళనలు లేవు.

ఇది కూడా చదవండి: E20 ఇంధనంతో మైలేజ్ తగ్గుతుందా? ఇంజిన్‌పై ప్రభావం ఉంటుందా?ఎక్స్‌పర్ట్స్ సమాధానాలు ఇవే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us