సీనియర్ సిటిజన్లకు ఉపశమనం కల్పించేందుకు రైల్వే శాఖ అనేక నియమాలను రూపొందించింది. ఇది వారి ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. సీనియర్ సిటిజన్ల కోసం లోయర్ బెర్త్‌లను బుక్ చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్‌ను సులభంగా కేటాయించడం గురించి ఐఆర్‌సీటీసీ తెలియజేసింది. తన మామయ్యకు రైలు టికెట్ బుక్ చేశానని, కాళ్లకు సమస్య ఉన్నందున లోయర్ బెర్త్‌కే ప్రాధాన్యత ఇచ్చానని, అయితే అప్పుడు కూడా రైల్వే తనకు పై బెర్త్ ఇచ్చిందని ఓ ప్రయాణికుడు ట్వీట్‌లో పేర్కొన్నాడు.
ప్రయాణికుడి ట్వీట్‌పై స్పందించిన రైల్వే మీరు జనరల్ కోటా కింద టికెట్ బుక్ చేసుకుంటే సీటు ఉంటేనే మీకు సీటు అలాట్‌మెంట్ లభిస్తుందని రాసింది. సీటు లేకపోతే రాదు. లోయర్ బెర్త్ కేటాయిస్తే మాత్రమే మీరు రిజర్వేషన్ ఛాయిస్ బుక్ కింద బుక్ చేసుకుంటే మాత్రం కచ్చితంగా మీకు లోయర్ బెర్త్ లభిస్తుందని స్పష్టం చేసింది.
లోయర్ బెర్త్‌లు మొదట వచ్చిన వారికి మొదటగా అందిస్తామని రైల్వే శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. సీట్లు ఉన్నప్పుడే జనరల్ కోటా కింద బుకింగ్ చేసుకునే వారికి సీట్లు కేటాయిస్తున్నట్లు రైల్వే తెలిపింది. ఈ సీట్లు ఫస్ట్ కమ్ అండ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన అందుబాటులో ఉంటాయి. జనరల్ కోటాలో సీటు పొందడం మొత్తం రైల్వే రిజర్వేషన్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. అయితే మీకు కచ్చితంగా లోయర్ బెర్త్ కావాలంటే మాత్రం ప్రయాణ సమయంలో టీటీఈను సంప్రదించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా లోయర్ బెర్త్ ఖాళీ ఉంటే టీటీఈ మీకు కేటాయించే అవకాశం ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి