Central Government: దేశ ప్రజలందరికీ కేంద్రం భారీ శుభవార్త.. నేటి నుంచి అమల్లోకి కొత్త రూల్..

కొత్త ఏడాది సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అమల్లోకి తెచ్చింది. ఈ నిర్ణయం వల్ల ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసేవారికి ఉపయోగం జరగనుంది. ఇంట్లో కొనుగోలు చేసే వస్తువులకు విద్యుత్ ఎంత ఖర్చు అవుతుందనేది వినియోగదారులు ముందే తెలుసుకోవచ్చు.

Central Government: దేశ ప్రజలందరికీ కేంద్రం భారీ శుభవార్త.. నేటి నుంచి అమల్లోకి కొత్త రూల్..
Electronic Goods

Updated on: Jan 01, 2026 | 6:00 AM

2025 ముగిసి కొత్త ఏడాది 2026లోకి అడుగుపెట్టాం. నూతన ఏడాది రావడంతో ప్రజలను ప్రభావితం చేసే కొత్త రూల్స్‌ను ప్రభుత్వాలు అమల్లోకి తీసుకొస్తుంటాయి. ఇప్పుడు నూతన సంవత్సరంలోకి ఎంట్రీ ఇవ్వడంతో జనవరి 1వ తేదీ నుంచి కొన్ని కొత్త నిర్ణయాలు అమల్లోకి వచ్చాయి. దేశంలోని ప్రజలందరూ వీటి గురించి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. కొత్త నిబంధనలు మీకు ముందే తెలిసి ఉండటం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందగలుగుతారు. ఆర్ధికంగా మీరు లాభం కూడా దీని వల్ల జరుగుతుంది. 2026 జనవరి 1 నుంచి ఓ కొత్త నిర్ణయం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అదేంటో తెలుసా..?

ఎలక్ట్రానిక్ వస్తువులు కొంటున్నారా..?

ఎలక్ట్రానిక్ వస్తువులు మీరు కొనుగోలు చేసేటప్పుడు కరెంట్ ఎంత వినియోగిస్తుందనే విషయాన్ని వాటిపై ముద్రించి ఉండే స్టార్ రేటింగ్స్ వల్ల మీరు తెలుసుకోవచ్చు. 3 స్టార్, 5 స్టార్ రేటింగ్ వంటివి ప్రింట్ చేసి ఉంటాయి. 3 స్టార్ రేటింగ్ వస్తువు అయితే విద్యుత్‌ను ఎక్కువగా వాడుతుంది. అదే 5 స్టార్ రేటింగ్ వస్తువైతే విద్యుత్ తక్కువ ఉపయోగించుకుంటుంది. జనవరి 1 నుంచి విద్యుత్ సామర్థ్యాన్ని తెలిపే ఈ స్టార్ లేబులింగ్‌ను కేంద్రం తప్పనిసరి చేసింది. దీంతో ఎలక్ట్రానిక్ కంపెనీలన్నీ ఇక నుంచి తప్పనిసరిగా దీనిని పాటించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి బ్యూర్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

ఏయే ప్రొడక్ట్స్‌ అంటే..?

వాషింగ్ మెషిన్, రిఫ్రిజిరేటర్, ఏసీ, టీవీలు,కూలింగ్ టవర్లు, చిల్లర్స్, ఎల్‌పీజీ గ్యాస్ స్టవ్స్, డీప్ ఫ్రీజర్లు, ఫ్టోర్ స్టాండింగ్ టవర్, కార్నర్ ఏసీలు, సీలింగ్ వంటి ప్రొడక్ట్స్‌కు లేబులింగ్ తప్పనిసరి చేశారు. గతంలో టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషిన్లు, ట్యూబలర్ ఫ్లొరోసెంట్ ల్యాంప్స్, ఎల్‌ఈడీ ల్యాంప్స్, ఎలక్ట్రిక్ వాటర్ హీటర్, ఫ్యాన్లు వంటి వస్తువులకు మాత్రమే ఖచ్చితంగా లేబులింగ్ ఉండాలనే నిబంధన ఉండేది. జనవరి 1వ తేదీ నుంచి మరిన్ని వస్తువులను ఇందులో చేర్చింది. ఈ జాబితాను కేంద్రం ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా జనవరి 1 నుంచి మరికొన్నిటిని యాడ్ చేసింది.