
2026 ఏప్రిల్ 1 నుండి ఆదాయపు పన్ను వ్యవస్థలో కీలక మార్పు చోటుచేసుకోనుంది. ఇప్పటివరకు జీతభత్యాలు పొందే ఉద్యోగులు ఆధారపడుతున్న ఫారం 16 స్థానంలో, కొత్తగా ఫారం 130 అమలులోకి రానుంది. ఇది కేవలం పేరు మార్పు మాత్రమే కాకుండా, మరింత విస్తృతమైన, పారదర్శకమైన పన్ను వివరాలను అందించే విధంగా రూపొందించబడింది. ఫారం 130 మీ ఆదాయం నుండి కట్ చేసిన TDSకు అధికారిక రుజువుగా పనిచేస్తుంది. ఉద్యోగులు, పింఛనుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు సమయంలో ఈ పత్రాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది.
ఫారం 16తో పోలిస్తే, ఫారం 130లో వివరాలు మరింత విస్తృతంగా ఉంటాయి. జీతం మాత్రమే కాకుండా, కొంతమంది సీనియర్ సిటిజన్ల వడ్డీ ఆదాయాన్ని కూడా ఇందులో చేర్చడం ప్రత్యేకత. దీంతో పన్ను లెక్కలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. ఈ ఫారం 130లో మొత్తం 3 భాగాలు ఉంటాయి.
ఫారం 130ను సాధారణంగా తయారు చేయలేరు. ఇది తప్పనిసరిగా TRACES Portal ద్వారా డౌన్‌లోడ్ చేయాలి. డిజిటల్ లేదా భౌతిక సంతకంతో జారీ చేసిన పత్రాలకే చెల్లుబాటు ఉంటుంది. పన్ను మినహాయించిన ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత, తదుపరి సంవత్సరం జూన్ 15లోపు ఫారం 130 జారీ చేయడం తప్పనిసరి. ఒకే ఆర్థిక సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ కంపెనీల్లో పనిచేసినట్లయితే, ప్రతి యజమాని వేర్వేరు ఫారం 130 జారీ చేస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి