PPF: మీ పీపీఎఫ్‌లో డబ్బులు జమ చేయడం మర్చిపోయారా? డియాక్టివేట్‌ అయ్యిందా? యాక్టివేట్ చేసుకోండిలా!

PPF Account: ఒకవేళ మీ ఖాతా రెండు సంవత్సరాలుగా నిష్క్రియంగా ఉంటే మీరు రూ.100 జరిమానా, రూ.1000 కనీస డిపాజిట్‌తో సహా మొత్తం రూ.1100 జమ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మీ ఖాతా యాక్టివ్‌ అవుతుంది. ఖాతాను యాక్టివ్‌ చేయడానికి మీరు..

PPF: మీ పీపీఎఫ్‌లో డబ్బులు జమ చేయడం మర్చిపోయారా? డియాక్టివేట్‌ అయ్యిందా? యాక్టివేట్ చేసుకోండిలా!
Ppf Account

Updated on: May 04, 2026 | 3:07 PM

PPF Deposit: మీరు మీ పీపీఎఫ్‌ ఖాతాలో కనీస వార్షిక మొత్తాన్ని జమ చేయడం మర్చిపోయి ఉంటే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పీపీఎఫ్‌ ఒక సురక్షితమైన పెట్టుబడి ఎంపిక. ఇది చిన్న పొరపాట్లతో కూడా మీ డబ్బు సురక్షితంగా ఉండేలా చూస్తుంది. అయితే సమయానికి పెట్టుబడి పెట్టడంలో విఫలమైతే మీ ఖాతా నిష్క్రియంగా మారవచ్చు. అదృష్టవశాత్తూ మీరు ఒక చిన్న జరిమానా చెల్లించి దానిని తిరిగి యాక్టివ్‌ చేసుకోవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ, నియమాలను తెలుసుకుందాం..

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనేది ఆదాయపు పన్ను ఆదా చేసుకోవడానికి, సురక్షితమైన దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టడానికి ఒక ప్రముఖమైన మార్గం. అయితే చాలా మంది ఆర్థిక సంవత్సరంలో కనీస పెట్టుబడి పెట్టడం మర్చిపోతారు. దీని ఫలితంగా వారి పీపీఎఫ్‌ ఖాతా నిష్క్రియంగా మారుతుంది. పీపీఎఫ్‌ నిబంధనల ప్రకారం, ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పెట్టుబడిదారుడు సంవత్సరం పొడవునా ఈ కనీస డిపాజిట్ చేయడంలో విఫలమైతే వారి ఖాతా నిష్క్రియంగా మారుతుంది. అయితే దీని అర్థం మీ డబ్బు పోతుందని కాదు. పీపీఎఫ్‌ అనేది భారత ప్రభుత్వం మద్దతు ఇచ్చే పథకం. అందుకే మీ పెట్టుబడి పూర్తిగా సురక్షితం.

ఇది కూడా చదవండి: Indian Railways: రైలు టికెట్ లేదా? అర్జెంట్‌గా వెళ్లాలా? టికెట్ లేకుండానే రైలు ఎక్కవచ్చు.. రైల్వే రూల్స్ ఇవే!

ఇవి కూడా చదవండి

ఖాతా నిష్క్రియంగా ఉంటే నష్టం!

ఒకసారి ఖాతా నిష్క్రియం చేయబడిన తర్వాత కొన్ని ఫీచర్లు నిలిచిపోతాయరు. ఉదాహరణకు మీరు ఆ ఖాతాపై రుణం తీసుకోలేరు. అలాగే పాక్షిక ఉపసంహరణలు కూడా నిలిచిపోతాయి. అంతేకాకుండా ఆ కాలానికి మీరు సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపులను పొందలేరు. ఇప్పుడు దానిని ఎలా తిరిగి యాక్టివ్‌ చేయాలి. జరిమానా ఎంత ఉంటుంది అనే ప్రశ్న తలెత్తుతుంది. పీపీఎఫ్‌ ఖాతాను తిరిగి యాక్టివ్‌ చేయడానికి మీరు కనీస పెట్టుబడి పెట్టని ప్రతి సంవత్సరానికి రూ.50 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా పెట్టుబడి పెట్టని ప్రతి సంవత్సరానికి రూ.500 డిపాజిట్ చేయడం తప్పనిసరి.

ఒకవేళ మీ ఖాతా రెండు సంవత్సరాలుగా నిష్క్రియంగా ఉంటే మీరు రూ.100 జరిమానా, రూ.1000 కనీస డిపాజిట్‌తో సహా మొత్తం రూ.1100 జమ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మీ ఖాతా యాక్టివ్‌ అవుతుంది. ఖాతాను యాక్టివ్‌ చేయడానికి మీరు మీ పీపీఎఫ్‌ ఖాతా ఉన్న బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్‌ను సందర్శించి, ఒక రాతపూర్వక దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. మీరు అవసరమైన మొత్తాన్ని జమ చేసిన తర్వాత బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ అధికారి మీ ఖాతా స్థితిని తనిఖీ చేసి, దానిని తిరిగి యాక్టివ్‌ చేస్తారు. అందువల్ల, మీరు పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడం మర్చిపోయి ఉంటే, దాని పూర్తి ప్రయోజనాలను పొందడానికి సకాలంలో దానిని తిరిగి సక్రియం చేసుకోండి.

ఇది కూడా చదవండి: Thalapathy Vijay: దళపతి విజయ్ దేశంలోనే అత్యంత ధనవంతుడైన సీఎం అవుతారా? ఆయన సంపద గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఇది కూడా చదవండి: Credit Card: మీ క్రెడిట్ కార్డును వాడకుండా అలాగే ఉంచితే ఏమవుతుంది? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Follow Us