ఆధార్.. ఇది ప్రతి ఒక్కరికి ముఖ్యమైన పత్రంగా మారిపోయింది. ఆధార్ లేనిది ఏ పని జరగదు. ఇది ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్. 12 అంకెల ఆధార్ నంబర్ అనేక పనులకు ఉపయోగించబడుతుంది. కొన్నిసార్లు ఆధార్ కార్డు పోయినా దాని నంబర్ కూడా మరచిపోయే అవకాశం ఉంటుంది.అయితే ఎన్‌రోల్‌మెంట్ నంబర్ తెలిస్తే, ఆధార్ నంబర్‌ను గుర్తించవచ్చు. మీకు ఎన్‌రోల్‌మెంట్ నంబర్ కూడా తెలియకపోతే? ఆధార్ నంబర్‌ను తిరిగి పొందే అవకాశం ఉంది. ఇది చాలా సులభం. UIDAI వెబ్‌సైట్‌లో మర్చిపోయిన ఆధార్ నంబర్‌ను కనుగొనవచ్చు. అయితే ఆధార్ కార్డులో మీ పేరు, దానితో నమోదైన మొబైల్ నంబర్ ఉంటే చాలు. ఆధార్ నంబర్‌ను సులభంగా కనుగొనవచ్చు.
ఆధార్ నంబర్‌ను కనుగొనడానికి సులభమైన మార్గం:
మొబైల్ నంబర్ కూడా తెలియకపోతే ఇలా..
మీరు మీ మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే, మీరు దానిని మరచిపోయినట్లయితే ఆధార్ నంబర్‌ను పొందే అవకాశం ఉంది. అందుకు ఆధార్ కేంద్రానికి వెళ్లి ప్రింట్ ఆధార్ సర్వీస్ పొందండి. ఆధార్ కేంద్రానికి వెళ్లి మీ పేరు, నగరం తదితర వివరాలను నమోదు చేయండి. వేలిముద్ర మొదలైన బయోమెట్రిక్ సమాచారాన్ని అందించండి. అది సరిపోతుంటే అక్కడ మీకు ఆధార్ కార్డు జారీ చేయబడుతుంది. అలాగే, 1947 నంబర్‌కు కాల్ చేసి, కాల్‌లో మీ పేరు, చిరునామా మొదలైనవి ఆపరేటర్‌కు చెప్పండి. వారు మీకు ఆధార్ నంబర్‌ను చెబుతారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి