US సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను దూకుడుగా పెంచుతుందనే భయంతో విదేశీ పెట్టుబడిదారులు గత వారం భారతీయ స్టాక్ మార్కెట్ల(Stock Market) నుంచి రూ. 4,500 కోట్లకు పైగా ఉపసంహరించుకున్నారు. అంతకుముందు ఏప్రిల్ 1 నుండి 8 వరకు, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (FPI) భారతీయ మార్కెట్‌లో రూ . 7,707 కోట్ల పెట్టుబడి పెట్టారు. అప్పట్లో మార్కెట్‌లో కరెక్షన్ కారణంగా ఎఫ్‌పీఐకి కొనుగోళ్లకు మంచి అవకాశం లభించింది. అంతకుముందు, మార్చి 2022 వరకు ఆరు నెలల కాలంలో, ఎఫ్‌పిఐలు నికర విక్రయదారులుగా మిగిలిపోయాయి. ఎఫ్‌పిఐలు షేర్ల నుంచి రూ. 1.48 లక్షల కోట్ల భారీ మొత్తాన్ని ఉపసంహరించుకున్నాయి. దీనికి ప్రధాన కారణం US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచడం, ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా సంక్షోభం ఏర్పడే అవకాశం ఉండడం.
సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ రైట్ రీసెర్చ్ వ్యవస్థాపకురాలు సోనమ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఉక్రెయిన్ సంక్షోభం సద్దుమణిగిన తర్వాత ఎక్కువ సంఖ్యలో ఎఫ్‌పిఐలు భారత్‌కు తిరిగి వస్తారని తాము ఆశిస్తున్నామని, వారి వాల్యుయేషన్‌లు అత్యంత పోటీతత్వంతో ఉన్నాయని అన్నారు. డిపాజిటరీ డేటా ప్రకారం, ఏప్రిల్ 11-13 మధ్య జరిగిన షార్ట్ హాలిడే ట్రేడింగ్ వారంలో ఎఫ్‌పిఐలు భారతీయ స్టాక్ మార్కెట్ల నుండి రూ.4,518 కోట్ల ఉపసంహరించుకున్నారు. గురువారం మహావీర్ జయంతి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి, శుక్రవారం గుడ్ ఫ్రైడే కావడంతో గత వారం స్టాక్ మార్కెట్ మూడు రోజులే పని చేసింది.
US సెంట్రల్ బ్యాంక్ దూకుడు రేట్ల పెంపు భయంతో వారంలో FPIలు నికర విక్రయదారులుగా ఉన్నారు. మార్నింగ్‌స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్-మేనేజర్ రీసెర్చ్ హిమాన్షు శ్రీవాస్తవ మాట్లాడుతూ, యుఎస్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను దూకుడుగా పెంచే అవకాశం ఉన్నందున ఎఫ్‌పిఐలు భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లలో తమ పెట్టుబడులపై జాగ్రత్తగా విధానాన్ని తీసుకున్నాయని చెప్పారు. గత వారం, ఎఫ్‌పిఐలు రుణం లేదా బాండ్ మార్కెట్ నుంచి రూ.415 కోట్లను ఉపసంహరించుకున్నాయి.
Read Also… Anand Mahindra: టాటాలకు ఆనంద్ మహీంద్రా విజ్ఞప్తి.. అలా చేయాలంటూ ట్విట్టర్ వేదికగా వినతి..