మీ ఆధార్‌ నెంబర్‌ ఏ ఫోన్‌ నెంబర్‌తో లింక్‌ అయిందో ఇలా తెలుసుకోండి..

|

Dec 29, 2023 | 5:40 PM

ఆధార్‌ కార్డును వినియోగించుకునే క్రమంలో రిజిస్టర్‌ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుందని తెలిసిందే. ఈ ఓటీపీని ఎంటర్‌ చేయడం ద్వారానే ఆధార్‌ సంబంధిత సేవలను పొందొచ్చు. అయితే మనలో కొందరికీ ఆధార్‌ కార్డ్‌ ఏ ఫోన్‌ నెంబర్‌తో లింక్‌ అయిందో మర్చిపోతారు. అలాంటప్పుడు మన ఆధార్‌ కార్డ్‌కు ఏ ఫోన్‌ నెంబర్‌ లింక్‌ అయ్యిందో తెలుసుకోవడానికి...

మీ ఆధార్‌ నెంబర్‌ ఏ ఫోన్‌ నెంబర్‌తో లింక్‌ అయిందో ఇలా తెలుసుకోండి..
Aadhar Card
Follow us on

ప్రస్తుతం ఆధార్‌ కార్డు వినియోగం అనివార్యంగా మారింది. ప్రభుత్వ పథకాలు మొదలు, చిన్న సిమ్‌ కార్డ్‌ వరకు ప్రతీ అవసరానికి ఆధార్‌ కార్డ్‌ ఉండాల్సిందే. ఇక ఎక్కడైనా ఆధార్‌ కార్డును వినియోగించుకునే క్రమంలో రిజిస్టర్‌ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుందని తెలిసిందే. ఈ ఓటీపీని ఎంటర్‌ చేయడం ద్వారానే ఆధార్‌ సంబంధిత సేవలను పొందొచ్చు. అయితే మనలో కొందరికీ ఆధార్‌ కార్డ్‌ ఏ ఫోన్‌ నెంబర్‌తో లింక్‌ అయిందో మర్చిపోతారు. అలాంటప్పుడు మన ఆధార్‌ కార్డ్‌కు ఏ ఫోన్‌ నెంబర్‌ లింక్‌ అయ్యిందో తెలుసుకోవడానికి యూఐడీఏఐ ఒక కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది.

మీ ఆధార్‌ లింక్‌ అయిన మొబైల్‌ నెంబర్‌ను తెలుసుకోవడానికి ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్ లేదా mAadhaar యాప్‌లోకి వెళ్లాలి. అనంతరం వెరిఫై మొబైల్‌/మొబైల్‌ మీద క్లిక్‌ చేయాలి. అనంతరం ఇక్కడ, మీ ఆధార్‌ నంబర్‌ ఏ మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్‌ ఐడీతో లింక్ అయివుందో తెలుసుకోవచ్చు. మీకు సంబంధం లేని ఇతర నంబర్‌తో ఆధార్‌ అనుసంధానమై ఉంటే దానిని సులభంగా గుర్తించొచ్చు. ఆ నంబర్‌ తీసేసి, మీ నంబర్‌ను అప్‌డేట్‌ చేయొచ్చు. ఆధార్‌ కార్డ్‌ ఎన్‌రోల్‌ చేసుకునే సమయంలో ఏ ఫోన్‌ నెంబర్‌ ఇచ్చారో తెలియకపోతే.. యాప్‌ లేదా వెబ్‌సైట్‌లో.. వెరిఫై ఆధార్‌ ఆప్షన్‌లోకి వెళ్లి, ఆధార్‌ నెంబర్‌ను నమోదు చేయాలి. వెంటనే మీరు ఏ మొబైల్‌ నంబర్‌ ఇచ్చారో, ఆ నంబర్‌లోని చివరి మూడు అంకెలు కనిపిస్తాయి.

ఇదిలా ఉంటే ఆధార్‌ కార్డను ఉపయోగిస్తున్న వారు కచ్చితంగా తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌ పద్ధతిలో ఆధార్‌ వివరాలను ఉచితంగా మార్చుకునే అవకాశం కల్పించింది. అయితే ఉచితంగా మార్చుకునే గడువు డిసెంబర్‌ 14వ తేదీతో ముగిసింది. అయితే భారీ ఎత్తున ప్రజలు తమ వివరాలను అప్‌డేట్ చేయకపోవడంతో.. ఈ గడువును మరో 3 నెలలకు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా వచ్చే ఏడాది మార్చి 14వ తేదీ వరకు ఉచితంగా ఆధార్‌ కార్డ్‌ వివరాలను ఉచితంగా మార్చుకునే అవకాశం కల్పించారు. ఆధార్‌ కార్డు అప్‌డేట్ 10 ఏళ్లు దాటితే.. కచ్చితంగా అప్‌డేట్‌ చేసుకోవాలని అధికారులు తెలిపారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..