Investment Plan: డబ్బు విషయంలో బిందాస్‌గా ఉండాలా.? ఈ 5 పనులు చేయండి..

|

Mar 09, 2024 | 7:41 PM

ఆర్థికంగా బలంగా ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా ఉద్యోగం నుంచి రిటైర్‌ అయిన తర్వాత వృద్ధాప్యంలో బిందాస్‌గా జీవించాలని కోరుకుంటారు. అందుకోసం ముందు నుంచే ప్రణాళికలను రచించుకుంటారు. మలి వయసులో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఎదురుకాకుండా, భవిష్యత్తులో వచ్చే సమస్యలను...

Investment Plan: డబ్బు విషయంలో బిందాస్‌గా ఉండాలా.? ఈ 5 పనులు చేయండి..
Retirement Plans
Follow us on

ఆర్థికంగా బలంగా ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా ఉద్యోగం నుంచి రిటైర్‌ అయిన తర్వాత వృద్ధాప్యంలో బిందాస్‌గా జీవించాలని కోరుకుంటారు. అందుకోసం ముందు నుంచే ప్రణాళికలను రచించుకుంటారు. మలి వయసులో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఎదురుకాకుండా, భవిష్యత్తులో వచ్చే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఎలాంటి విధానాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఉద్యోగం మొదలు పెట్టిన రోజు నుంచే రిటైర్‌మెంట్ ప్లానింగ్ చేసుకోవడం ముఖ్యమని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఉద్యోగులు వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్‌తో పీఎఫ్‌ ఖాతాను ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మీకు పీఎఫ్‌ ఖాతా లేకపోతే రికరింగ్ డిపాజిట్‌, పీపీఎఫ్‌, మ్యూచువల్‌ ఫండ్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టాలి. నెల నెల కొంత జీతాన్ని కచ్చితంగా పెట్టుబడిగా పెట్టడం అలవాటుగా మార్చుకోవాలి.

* ఇక అత్యవసర నిధిని కచ్చితంగా ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి అని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకోవడానికి అత్యవసర నిధి ఎంతగానో ఉపయోగపడుతుంది. అత్యవసరి నిధిలో మీ ఆరు నెలలో జీతంతో సమానమైన మొత్తం ఉండేలా చూసుకోవాలి చెబుతున్నారు.

* ఎమర్జెన్సీ ఫండ్‌తో పాటు జీవిత బీమా కూడా కచ్చితంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యానికి ఎక్కువ డబ్బులు అవసరపడుతోన్న ప్రస్తుత తరుణంలో ప్రతీ ఒక్కరూ కచ్చితంగా బీమా పాలసీ చేసుకోవాలి. చిన్న వయసులోనే పాలసీ చేసుకోవడం ద్వారా తక్కు ప్రీమియం చెల్లించే వెసులుబాటు లభిస్తుంది.

* ఇక భవిష్యత్తులో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకావొద్దంటే మంచి రాబడులతో కూడిన ఎంపికల్లో పెట్టుబడులు పెట్టాలని చెబుతున్నారు. బ్యాంకుల్లో ఎఫ్‌డీలు, స్టాక్‌ మార్కెట్‌లో షేర్స్‌ కొనుగోలు వంటి ఆప్షన్స్‌ ద్వారా భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని సూచిస్తున్నారు.

* భవిష్యత్తులో ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దంటే తీసుకునే రుణాల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక సలహాదారులు చెబుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలంగా ఉండే హౌజింగ్ లోన్స్‌ వంటి వాటిని త్వరగా పూర్తి చేసుకునేలా ప్లాన్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..