ప్రస్తుత కాలంలో చాలా వరకు చెల్లింపులన్నీ యూపీఐ యాప్స్ ద్వారానే అయిపోతున్నాయి. అందుకు ఇప్పుడంతా డిజిటల్ చెల్లింపుల కాలం కావడమే కారణమని చెప్పుకోవాలి. ప్రతిసారి డెబిట్ కార్డుతో ఏటీఎం సెంటర్‌కెళ్లి డబ్బు డ్రా చేయాలంటే మనకు కూడా కష్టంగా ఉంటుంది కదా.. అయితే గూగుల్ పే, భీమ్, ఫోన్‌పే తదితర యాప్స్‌లో యూపీఐ యాక్టివేషన్ కోసం డెబిట్‌కార్డు తప్పనిసరిగా ఉండేది. అనుకోకుండా డెబిట్ కార్డు ఎక్కడైనా పోతే ఇక అంతే సంగతి. కానీ ఇప్పుడు డెబిట్ కార్డుతో సంబంధం లేకుండా.. ఆధార్ నంబర్‌తో యూపీఐ యాక్టివేట్ చేసుకోవచ్చు. డెబిట్‌కార్డుతో యూపీఐ యాక్టివేషన్ వల్ల ప్రక్రియతో కొన్ని ప్రతిబంధకాలు వచ్చాయి. చాలా మందికి పలు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నా.. డెబిట్ కార్డు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) తన ఖాతాదారుల వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. ‘మీకు ఈ విషయం తెలుసా..? మీరు యూపీఐ యాక్టివేట్ చేసుకోవడానికి డెబిట్ కార్డు వాడాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డు స్కాన్ చేసి యూపీఐ యాక్టివేట్ చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం https://bit.ly/3V9NOw3ను సందర్శించాల’ని పీఎన్బీ ట్వీట్ చేసింది.
Did you know? You don’t need your Debit card to register for UPI.
Ride the UPI wave with Aadhaar Card and scan away! For more info, visit: https://t.co/Vj7OfmkLEp #UPI #AadhaarCard #Digital #Banking #Transaction pic.twitter.com/HpJG6mnU9A
— Punjab National Bank (@pnbindia) January 29, 2023
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి