Business Ideas: ఈ బిజినెస్ ఎవర్‌ గ్రీన్‌.. నెలకు రూ. లక్షల వరకు ఆదాయం..

|

Dec 30, 2023 | 3:08 PM

ప్రస్తుతం ఫ్లోర్‌ వైపర్స్‌కి భారీగా డిమాండ్ ఉంది. ఒకప్పుడు కేవలం పట్టణాల్లో మాత్రమే ఉపయోగించే వైపర్స్‌ని ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉపయోగిస్తున్నారు. ప్రతీ ఇంట్లో మార్బుల్స్‌, టైల్స్‌ వినియోగం పెరగడంతో ఈ ఫ్లోర్‌ వైపర్స్‌కి గిరాకీ పెరిగింది. ఇక కేవలం ఇంట్లో మాత్రమే కాకుండా ఆఫీసులు, స్కూళ్లు, హోటల్స్‌లో కూడా వైపర్స్‌ వినియోగం భారీగా పెరుగుతున్నాయి. ఇలాంటి డిమాండ్ ఉన్న బిజినెస్‌ను...

Business Ideas: ఈ బిజినెస్ ఎవర్‌ గ్రీన్‌.. నెలకు రూ. లక్షల వరకు ఆదాయం..
Buiness Idea
Follow us on

యువత ఆలోచన మారుతోంది. ఐఐటీలు, ఎన్ఐటీల్లో చదివిన వారు కూడా ఆసక్తితో వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు. తమలోని నైపుణ్యంతో సొంత వ్యాపారం చేస్తూ తమతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు. వినూత్న బిజినెస్‌ ఐడియాలను ఎంచుకొని భారీగా లాభాలను ఆర్జిస్తున్నారు. ఇలాంటి బెస్ట్ బిజినెస్‌ ఐడియాల్లో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం ఫ్లోర్‌ వైపర్స్‌కి భారీగా డిమాండ్ ఉంది. ఒకప్పుడు కేవలం పట్టణాల్లో మాత్రమే ఉపయోగించే వైపర్స్‌ని ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉపయోగిస్తున్నారు. ప్రతీ ఇంట్లో మార్బుల్స్‌, టైల్స్‌ వినియోగం పెరగడంతో ఈ ఫ్లోర్‌ వైపర్స్‌కి గిరాకీ పెరిగింది. ఇక కేవలం ఇంట్లో మాత్రమే కాకుండా ఆఫీసులు, స్కూళ్లు, హోటల్స్‌లో కూడా వైపర్స్‌ వినియోగం భారీగా పెరుగుతున్నాయి. ఇలాంటి డిమాండ్ ఉన్న బిజినెస్‌ను ప్రారంభిస్తే లాభాలు ఆర్జించవచ్చు. ఇంతకీ ఫ్లోర్‌ వైపర్స్‌ తయారీ పరిశ్రమను ఎలా ప్రారంభించాలి.? దీనికి అయ్యే ఖర్చు ఎంత.? లాభాలు ఎలా ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం..

ఫ్లోర్‌ వైపర్స్‌ తయారీ పరిశ్రమను ప్రారంభించడానికి సుమారు రూ. 20 లక్షల వరకు అవసరపడుతుంది. అయితే ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకం ద్వారా బ్యాంకుల నుంచి రూ. 10 లక్షల వరకు రుణం పొందొచ్చు. ఇక ఫ్లోర్ వైపర్స్ యూనిట్‌కు కనీసం 1800 చదరపు అడుగుల స్థలం అవసరం ఉంటుంది. సొంత స్థలం లేక పోయినా అద్దెకు తీసుకొని ఏర్పాటు చేసుకోవచ్చు. ఫ్లోర్‌ వైపర్స్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే.. జీఎస్టీలో రిజిస్టర్ చేయించుకోవాలి. ఎన్‌వోసీ కోసం ఫైర్ సేఫ్టీ బోర్డు, కాలుష్య నియంత్రణ మండలికి దరఖాస్తు చేసుకోవాలి. ట్రేడ్ లైసెన్స్‌కు అప్లై చేసుకోవాలి.

పెట్టుబడి విషయానికొస్తే.. స్థలంలో పాటు, ప్లాంట్‌, మిషనరీకి రూ. 13.55 లక్షలు ఖర్చుతుంది. ఇతర వస్తువలకు అదనంగా ఖర్చవుతుంది. పరిశ్రమకు అవసరమైన యంత్రాలను కొనుగోలు చేసే సమయంలో వాటిని ఎలా ఉపయోగించాలనే దానిపై డెమో నిర్వహిస్తారు. ఇక ఆదాయం విషయానికొస్తే ఫ్లోర్‌ వైపర్స్‌ను సరైన విధానంలో మార్కెటింగ్‌ చేసుకుంటే నెలకు కనీసంలో కనీసం రూ. లక్ష వరకు సంపాదించుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..