Flipkart: గృహోపకరణాల రిపేర్ ఇప్పుడు మరింత సులభం.. కొత్త సేవలను ప్రారంభించిన ఫ్లిప్‌ కార్డ్..

|

Dec 26, 2022 | 8:54 AM

ఇంట్లో పాడైన వస్తువులు లేదా.. ఇతర గృహోపకరణాల మరమ్ముతులు చేయించాలంటే గతంలో మన చుట్టు పక్కల వాటిని రిపేర్‌ చేయించేవాళ్లుంటే.. పిలుచుకొచ్చి చేయించేవాళ్లు.. కాలం మారుతున్న కొద్ది.. పద్ధతులు మారుతూ వస్తున్నాయి. ఇటీవల కాలంలో..

Flipkart: గృహోపకరణాల రిపేర్ ఇప్పుడు మరింత సులభం.. కొత్త సేవలను ప్రారంభించిన ఫ్లిప్‌ కార్డ్..
Flipkart
Follow us on

Flipkart: ఇంట్లో పాడైన వస్తువులు లేదా.. ఇతర గృహోపకరణాల మరమ్ముతులు చేయించాలంటే గతంలో మన చుట్టు పక్కల వాటిని రిపేర్‌ చేయించేవాళ్లుంటే.. పిలుచుకొచ్చి చేయించేవాళ్లు.. కాలం మారుతున్న కొద్ది.. పద్ధతులు మారుతూ వస్తున్నాయి. ఇటీవల కాలంలో ఏదైనా వస్తువు పాడైతే మెకానిక్ దగ్గరకు మనం తీసుకెళ్లి చేయించుకోవల్సి వస్తుంది. ఇదే సమయంలో పట్టణాలు, నగరాల్లో అయితే.. సర్వీస్ ఛార్జి తీసుకుని.. రిపేర్‌ కోసం ఇంటికి వస్తున్నవారు ఉన్నారు. అయితే వస్తువు రిపేర్ చేసినా, చేయకపోయినా.. వారికి విజిటింగ్ ఛార్జీ చెల్లించాల్సి వస్తుంది. ఇలా ప్రస్తుతం చాలా మంది తమ ఇంట్లో పాడైనా వస్తువులను రిపేర్ చేయించుకోవడానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది అయితే.. పాడైనా వస్తువుకు మరమ్మతులు చేయించి.. వాడుకోవడానికి వీలుగా ఉండే అవకాశం ఉన్నప్పటికి కొంతమంది.. రిపేర్లు చేయించడానికి విసుగు చెంది వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెడుతూ.. ఇప్పటివరకు వస్తువులను డెలివరీ చేసే ఫ్లిప్‌కార్ట్ ఇక నుంచి వాటి రిపేర్లు చేసే సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఇంట్లో ఏవైనా విద్యుత్ పరికరాలు పాడైనా లేదా కొత్తగా ఇన్‌స్టాల్ చేయాలన్నా.. ఇక నుంచి ఫ్లిప్‌కార్డ్ ద్వారా మరమ్మతుల సేవలు పొందవచ్చు. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, గృహోపకరణాల మరమ్మతుల కోసం గృహ సేవ, మరమ్మతు, నిర్వహణ సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది . దీంతో ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో విక్రయాలు సాగిస్తున్న ఈ సంస్థ సర్వీస్‌, రిపేర్‌ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. ఫ్లిప్‌కార్ట్ అనుబంధ సంస్థ అయిన ‘ జీవ్స్ ‘ ద్వారా ఈ సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తోంది.

ఫ్లిప్‌కార్డ్ నెల రోజుల క్రితం ‘జీవ్స్’ ద్వారా గృహోపకరణాల సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఇప్పుడు ఈ సేవలను 19,000 పిన్‌కోడ్‌ల పరిధిలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉత్పత్తి, సర్వీస్, రిపేర్, మెయింటెనెన్స్ వంటి సేవలను కస్టమర్ ఇంటి వద్దకే వెళ్లి అందించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. సమర్ధవంతమైన, కస్టమర్-సెంట్రిక్ సర్వీసెస్‌ జీవ్స్‌ ద్వారా అందించనున్నట్లు తెలిపింది. పరికరాల విక్రయం తర్వాత, సంబంధిత సేవలు వినియోగదారులకు అవసరమని సంస్థ భావించి.. గృహోపకరణ సేవలను ప్రారంభించినట్లు తెలిపింది. కస్టమర్లకు తక్కువ ధరకే అనుకూలమైన, విశ్వసనీయమైన సరసమైన సేవలు లభిస్తాయని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌నకు చెందిన జీవ్స్‌ సంస్థ పేర్కొంది. జీవ్స్‌ సంస్థకు దాదాపు 300 వాక్-ఇన్ సర్వీస్ సెంటర్‌లు ఉండగా.. వెయ్యి కంటే ఎక్కువ మంది సేవా భాగస్వాములు ఉన్నారు. 400 నగరాల్లో 9,000 మంది నైపుణ్యం ఉన్న, శిక్షణ పొందిన ఇంజినీర్లు ఉన్నారని సంస్థ తెలిపింది.

సేవలు పొందడం ఎలా

మొదట ఫ్లిప్‌కార్ట్ యాప్ ఓపెన్‌ చేసి కేటగిరీల విభాగంలో క్లిక్‌ చేసి రిపేర్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత.. ఏమి రిపేర్ చేయించాలనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఉదాహరణకు మొబైల్ రిపేర్, ఏసీ క్లీనింగ్‌, గీజర్ ఇన్‌స్టాలేషన్, టీవీ ఇన్‌స్టాలేషన్, ల్యాప్‌టాప్‌ రిపేర్‌ ఇలా పలు రకాల సేవల వివరాలు ఉంటాయి. వాటిలో అవసరమైన దానిని ఎంచుకోవాలి.

సేవను ఎంచుకున్న తర్వాత, ఆ సేవలకు అవసరమైన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..