Flipkart Big Billion sale: యాక్సిస్‌ బ్యాంకు పండుగ బొనాంజా.. ఆన్‎లైన్ షాపింగ్ చేస్తే 45 శాతం వరకు క్యాష్‎బ్యాక్..!

|

Oct 05, 2021 | 8:55 PM

Axis Bank Offers: పండుగ సీజన్ కావటంతో పలు బ్యాంకులు క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పిటికే ఎస్బీఐ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంకులు ఆఫర్లు ప్రకటించాయి.

Flipkart Big Billion sale: యాక్సిస్‌ బ్యాంకు పండుగ బొనాంజా.. ఆన్‎లైన్ షాపింగ్ చేస్తే 45 శాతం వరకు క్యాష్‎బ్యాక్..!
Axis
Follow us on

Axis Bank Offers: పండుగ సీజన్ కావటంతో పలు బ్యాంకులు క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పిటికే ఎస్బీఐ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంకులు ఆఫర్లు ప్రకటించాయి. తాజాగా ప్రముఖ బ్యాంకింగ్‌ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంకు ఖాతాదారులకు తీపి కబురును అందించింది. యాక్సిస్ బ్యాంక్ తన ఏఎస్‌ఏపీ డిజిటల్ సేవింగ్స్ నూతన బ్యాంక్ కస్టమర్ల కోసం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో షాపింగ్‌ చేస్తే 10 నుంచి 15 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. అంతేకాకుండా 30 కంటే ఎక్కువ బ్రాండ్‌లపై 45 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది. ఈ క్యాష్‌బ్యాక్‌ను యాక్సిస్ బ్యాంక్ ఆన్‌లైన్ మార్కెట్‌ ప్లేస్‌లో “గ్రాబ్ డీల్స్” ద్వారా పొందవచ్చు.

ఎఏస్‌ఎపీ డిజిటల్ సేవింగ్స్ ఖాతాల్లో భాగంగా ఈజీ, ప్రైమ్, ప్రయారిటీ, బుర్గుండి పేరిట నాలుగు రకాల ఖాతాలను యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రవేశపెట్టింది. అంతేకాకుండా వీడియో కేవైసీ ప్రక్రియ ద్వారా బ్యాంక్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఖాతాదారులు ఖాతాలను తెరిచే సౌకర్యాన్ని యాక్సిస్‌ అందిస్తోంది. ఈజీ ఖాతాల డెబిట్ కార్డులపై 10 శాతం, ప్రైమ్‌ ఖాతాల డెబిట్‌ కార్డులపై 12.5 శాతం, ప్రయారిటీ అండ్‌ బుర్గుండీ ఖాతాలపై ఫ్లాట్ 15 శాతం క్యాష్‌బ్యాక్‌ను యాక్సిస్‌ అందిస్తోంది. ఈ ఆఫర్‌ ఖాతాదారులకు 2021 నవంబర్ 30 వరకు అందుబాటులో ఉండనుంది. కాగా ఈ ఆఫర్‌ కేవలం ఆర్నెల్లకుపైగా ఏఎస్‌ఏఎస్‌ ఖాతాలను కల్గిన వారికే వర్తించనుంది. క్యాష్‌బ్యాక్‌ను నేరుగా అకౌంట్లో జమా అవుతోందని యాక్సిస్‌ బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ భాగంగా ఆపిల్ ఐఫోన్ 12 మినీ కూడా భారీ డిస్కౌంట్‌తో లభిస్తుంది. 64GB స్టోరేజ్ ఐఫోన్ 12 రూ .38,999గా ఉంది. యాక్సిస్ బ్యాంకు కార్డుల ద్వారా అదనంగా 10 శాతం వరకు గరిష్ఠంగా రూ.1500 క్యాష్‎బ్యాక్ పొందవచ్చు. ఐఫోన్ 12 మోడల్ 64GB స్టోరేజ్ ఫోన్‎ను రూ .49,999 అందిస్తున్నారు. యాక్సిస్ బ్యాంక్ కార్డులను ఉపయోగించి 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు. గూగుల్ పిక్సెల్ 4 ఎ అత్యల్ప ధరలో లభిస్తుంది. రూ .25,999 తగ్గింపు ధరలో స్మార్ట్ ఫోన్ కెమెరా అందుబాటులో ఉంది. దీనికి యాక్సిస్ బ్యాంకు కార్డు షాపింగ్‌పై మీరు 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు.

Read Also..   Digital Payments: భారీగా పెరిగిన డిజిటల్ చెల్లింపులు.. యూపీఐ లావాదేవీల్లో కొత్త రికార్డ్.. యూపీఐ గురించి తెలుసుకోండి!