Today Silver Price: దేశీయంగా వెండి ధర తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న వెండి గురువారం కూడా స్వల్పంగా తగ్గింది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ సందర్భంగా బంగారం, వెండి దిగుమతులపై సుంకాలు తగ్గిస్తామని చేసిన ప్రతిపాదనతో వెండి ధర వెనుకంజ వేస్తోంది. అయితే తాజాగా బంగారం ధర పెరుగగా, వెండి మాత్రం స్వల్పంగా తగ్గింది. దేశీయంగా చూస్తే కిలో వెండి ధర రూ.69,600 ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.74,400 ఉండగా, ముంబైలో రూ. 69,600 ఉంది, అదే దేశ రాజధాని ఢిల్లీలో రూ.69,900 ఉండగా, కోల్‌కతాలో రూ.69,600 ఉంది. ఇక బెంగళూరులో రూ. 69,200 ఉండగా, హైదరాబాద్‌లో 74,400 ఉంది. అదే విజయవాడలో రూ. 74,400 ఉంది.
Gold Price Today: మళ్లీ పరుగులు పెడుతున్న పసిడి.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..