మీరు కొత్తగా మొబైల్ ఫోన్ కొనాలని చూస్తున్నారా.? అయితే తక్కువలోనే స్పెషల్ ఫీచర్ల ఉన్న ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘రియల్ మీ’ రెండు కొత్త ఫీచర్ ఫోన్లను తాజాగా విడుదల చేసింది. డిజో స్టార్ 300, డిజో స్టార్ 500 పేర్లతో రిలీజైన ఈ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ. 2,299, రూ.1,799కి అందుబాటులోకి వచ్చాయి. అలాగే బ్లాక్, గ్రీన్, సిల్వర్ రంగుల్లో ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్లలో లభిస్తున్నాయి. ఆకర్షణీయంగా, క్లాసికల్‌గా కనిపించే ఈ బ్రాండెడ్ ఫోన్లు చాలా సహేతుకమైన ధరలకే ప్రజలకు అందుబాటులో ఉంటాయని సదరు సంస్థ ఓ ప్రకటనలో తెలియజేసింది.