వినియోగదారులకు గుడ్‌న్యూస్.. కొత్త కనెక్షన్స్‌ లేవనే టెన్షనొద్దు.. ఇలా ఈజీగా సిలిండర్ పొందండి!

మనకు కావాల్సిన నిత్యావసర వస్తువులలో గ్యాస్ సిలిండర్ కూడా ఒకటి. కానీ ప్రస్తుతం మన దేశంలో కొత్తగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం ఆపేసిన విశయం అందిరికీ తెలిసిందే. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరా నిలిచిపోవడం కారణంగా ఈ సమస్య ఏర్పడిందని అంటున్నారు. అయితే కొత్త కనెన్షన్స్ తిరిగి స్టార్ట్ అయ్యే వరకు వినియోగదారులకు ఉపశమని కలిగించేలా ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. అదేంటో తెలుసుకుందాం పదండి.

వినియోగదారులకు గుడ్‌న్యూస్.. కొత్త కనెక్షన్స్‌ లేవనే టెన్షనొద్దు.. ఇలా ఈజీగా సిలిండర్ పొందండి!
Why New Lpg Connections Are Halted And 5kg Solution

Updated on: Oct 11, 2026 | 6:40 AM

మనం ఇంట్లో వంట చేసుకోవాలంటో గ్యాస్ సిలిండర్ కచ్చితంగా కావాల్సిందే. ప్రస్తుతం ఇండియన్, హెచ్‌పీ గ్యాస్, భారత్ గ్యాస్.. ఈ మూడు ప్రధాన గ్యాస్ కంపెనీలే దేశ మొత్తం సిలిండర్లను సరఫరా చేస్తున్నాయి. అయితే పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా.. చమురు రవాణకు ముఖ్యమైన హర్మోజ్ జలసంధింని.. ఇరాన్ మూసి వేయడంతో గతంలో చుమురు సరఫరా నిలిచిపోయింది. దీంతో అప్పటి నుంచి దేశంలో చమురు కొరత ఏర్పడింది.

భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో ఎక్కువ శాతం గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. అయితే ప్రస్తుతం ఈ దేశాల నుంచి వచ్చే చమురు సరఫరా తగ్గిపోవడంతో.. భారత్ లేక అమెరికా, రష్యా నుంచి ఎల్పీజీని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. సరఫరాలో కొరత ఏర్పడటంతో మార్చి నెల నుంచి దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమైంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిబంధనలు అమలులోకి తెచ్చింది.

సిలిండర్ బుకింగ్ మధ్య వ్యవధిని పెంచడం, వాణిజ్య సిలిండర్ల కంటే గృహ వినియోగ సిలిండర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వంటి నిర్ణయాలు తీసుకుంది. అంతేకాదు.. అప్పట్లో కొత్త గ్యాస్ కనెక్షన్ల జారీపై కూడా తాత్కాలిక నిషేధం విధించింది. అయితే గత జూన్ నెలలో సిలిండర్ల బుకింగ్‌పై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసినప్పటికీ.. కొత్త కనెక్షన్‌ల జారీపై మాత్రం ఇంకా నిషేదం కొనసాగిస్తూనే ఉంది.

ప్రత్యామ్నాయం ఏంటి?

అలాగే కొత్త గ్యాస్ కనెక్షన్ల జారీ మళ్లీ స్టార్ట్ చేసేంత వరకు వినియోగదారులు ఊరట కల్పించేలా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటలు చేసింది. అవును.. ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ పథకం కింద అందుబాటులో ఉంచే చిన్న రకం 5 కిలోల గ్యాస్ సిలిండర్లను ఎలాంటి అదనపు డాక్యుమెంట్లు లేకుండా కొనుగోలు చేసి తమ అవసరాలను తీర్చుకోవచ్చని పేర్కొంది. ఇది కొత్త కనెక్షన్స్ తిరిగి ప్రారంభమయ్యే వరకు ఇది వినియోగదారులకు స్వల్ప ఊరటని కలిగిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us