Old Coin: అదిరిపోయే ఆఫర్..మీ దగ్గర ఆ రెండు రూపాయల కాయిన్ ఉందా.. అయితే, మీరు లక్షాధికారులు కావచ్చు..ఎలా అంటే..

|

Sep 06, 2021 | 3:56 PM

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది నానుడి. నిజంగానే కొన్ని వస్తువులు పాతబడే కొద్దీ ఖరీదైనవిగా మారిపోతాయి. పాత పెయింటింగ్స్.. కొన్ని రకాల వస్తువులు ఎంత పాతగా అయిపోతే అంత ధర పలుకుతూ ఉంటాయి.

Old Coin: అదిరిపోయే ఆఫర్..మీ దగ్గర ఆ రెండు రూపాయల కాయిన్ ఉందా.. అయితే, మీరు లక్షాధికారులు కావచ్చు..ఎలా అంటే..
Old Coins
Follow us on

Old Coin: ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది నానుడి. నిజంగానే కొన్ని వస్తువులు పాతబడే కొద్దీ ఖరీదైనవిగా మారిపోతాయి. పాత పెయింటింగ్స్.. కొన్ని రకాల వస్తువులు ఎంత పాతగా అయిపోతే అంత ధర పలుకుతూ ఉంటాయి. పురాతనమైన వస్తువుల విషయంలో వాటి విలువ ఒక్కోసారి అనూహ్యంగా కూడా ఉంటుంది. ప్రస్తుతం పాత నాణేలు.. కరెన్సీకి గిరాకీ బాగా పెరిగింది. చాలా వెబ్సైట్స్ ఆన్లైన్ లో పాత నాణేల కోసం ప్రకటనలు ఇస్తున్నాయి. వాటికి విపరీతమైన ధరనూ ఆఫర్ చేస్తున్నాయి.

కారణాలు స్పష్టంగా తెలియకపోయినా మన పాత నాణేలకు డిమాండ్ ఎక్కువే. మీ దగ్గర పాత కాయిన్ ఉంటె దానితో మీరు లక్షలు గడించే అవకాశం ఉంటుంది. ఇదంతా ఆన్లైన్ లో జరుగుతుంది. ప్రస్తుతం పాత 2 రూపాయల కాయిన్ విలువ విపరీతంగా పెరిగింది. వీటిని తమకు ఇచ్చి లక్షల్లో సోమ్ముతీసుకోమని ఒక వెబ్సైట్ ప్రకటించింది. కొంతమంది ఇలా పాత నాణెలు/ నోట్లను ఆన్ లైన్‌లో కలెక్ట్ చేస్తుంటారు. వాటికి రూ. లక్షల్లో నగదు ఇస్తుంటారు. ఇప్పుడు పాత రూ.2 నాణెనికి రూ. 5 లక్షలు ఇస్తామని చెబుతున్నారు. అయితే, ఆ 2 రూపాయల కాయిన్ 1994కి చెందినది అయివుండాలి. ఈ కాయిన్ వెనుక భారత జాతీయ జెండా ఉండాలి. ఈ రెండు ఉన్న రెండురూపాయల కాయిన్ మీదగ్గర ఉంటె.. మీకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 లక్షల రూపాయల నగదు లభిస్తుంది. మీ దగ్గర అటువంటి కాయిన్ ఉంటె వెంటనే త్వరపడండి. క్విక్కర్ వెబ్సైట్ విజిట్ చేసి ఈ ఆఫర్ పట్టేయండి.

ఇప్పుడే కాదు గతంలోనూ ఇటువంటి చాలా ఆఫర్లు ఆన్లైన్ లో వచ్చాయి. 5 రూపాయల నోటు.. కొన్ని రకాల కాయిన్స్ కు విపరీతమైన నగదు ఆఫర్ ఇస్తూ వెబ్సైట్లలో ప్రకటనలు వచ్చాయి. ఇప్పుడు ఇలా రెండు రూపాయల కాయిన్ కు ఐదు లక్షల ఆఫర్ వచ్చింది.

ఇది ఎంతవరకూ నిజం అనేదానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే, మీరు వెబ్సైట్ విజిట్ చేసినపుడు అన్నిటినీ సరిగా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మీరు నాణెం ఇస్తే వారు డబ్బు ఇస్తారు. ఈ లావాదేవీ అంతే. మీరు ఇచ్చే నాణెంతో పాటు.. ఏదైనా ఫీజులు అని కానీ, టాక్స్ లు అనికానీ ఎవరైనా అడిగితే అది ఫేక్ అని భావించవచ్చు. ఎందుకంటే, ఆన్లైన్ లో వారు అడుగుతున్నది కాయిన్ మాత్రమే. మీరు కాయిన్ వారికీ అమ్ముతున్నారు. అటువంటప్పుడు దానికి మీరు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదనేది అందరూ తెలుసుకోవలసి ఉంది. ఏదైనా నగదు లావాదేవీల వ్యవహారం కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం అవసరం అనేది నిపుణుల సూచన.

Also Read: Viral Photos: నోకియా 3310 ఫోన్‌ను మింగేసిన వ్యక్తి..! స్కానింగ్ చేయగా వెల్లడైన అసలు నిజం..

Red Bhindi: ఎర్ర బెండకాయలను పండిస్తున్న రైతు.. ఇవి ఆరోగ్యానికి ఆరోగ్యం.. లాభసాటి అంటున్న అన్నదాత