UPI Payment: యూపీఐ పేమెంట్స్‌ చేస్తున్నారా.? అయితే ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..

|

Aug 26, 2022 | 5:40 PM

UPI Payment: దేశంలో డిజిటల్‌ పేమెంట్స్‌ భారీగా పెరిగాయి. పెద్ద నోట్ల రద్దు.. అనంతరం కరోనా నేపథ్యంలో ప్రజలు ఎక్కువగా ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. టీ కొట్టు నుంచి పెద్ద పెద్ద షోరూమ్స్‌ వరకు ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ను స్వీకరిస్తున్నాయి...

UPI Payment: యూపీఐ పేమెంట్స్‌ చేస్తున్నారా.? అయితే ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..
Upi Payments
Follow us on

UPI Payment: దేశంలో డిజిటల్‌ పేమెంట్స్‌ భారీగా పెరిగాయి. పెద్ద నోట్ల రద్దు.. అనంతరం కరోనా నేపథ్యంలో ప్రజలు ఎక్కువగా ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. టీ కొట్టు నుంచి పెద్ద పెద్ద షోరూమ్స్‌ వరకు ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ను స్వీకరిస్తున్నాయి. అందులోనూ పలు ప్రముఖ కంపెనీలు యూపీఐ ఆధారిత పేమెంట్స్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావడం కూడా యూపీఐ పేమెంట్స్‌ పెరగడానికి కారణాలు చెప్పొచ్చు. కేవలం పేమెంట్స్‌ మాత్రమే కాకుండా.. ఒకరి నుంచి మరొకరి డబ్బులను సైతం ఎంతో సులభంగా పంపించుకుంటున్నారు. సింగిల్‌ క్లిక్‌తో మనీ ట్రాన్స్‌ఫర్‌ అవుతోంది. అయితే యూపీఐ పేమెంట్స్‌ చేసే సమయంలో కచ్చితంగా కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ విషయాలు ఏంటంటే..

* యూపీఐ పేమెంట్స్‌ చేసే సమయంలో చాలా మంది తొందరపాటు గురవుతుంటారు. ముఖ్యంగా ఒకే పేరుతో కాంటాక్ట్‌లు ఉండడం వల్ల మీరు పంపించాలనుకునే వారికి కాకుండా ఇతరులకు డబ్బులు వెళ్లే ప్రమాదం ఉంది. ఇటీవల ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. మళ్లీ డబ్బులు తిరిగి రావాలంటే సమయం, శ్రమతో కూడుకున్న పని. కాబట్టి డబ్బులు పంపే ముందే ఒకటికి రెండు సార్లు పేరు, నెంబర్‌ను చెక్‌ చేసుకోని పంపించడం ఉత్తమం.

* కొందరు మొబైల్‌ ఫోన్స్‌లో ఒకటి కంటే ఎక్కువ యూపీఐ యాప్స్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే ఇది అంత మంచి పద్ధతి కాదు. దీనివల్ల కన్ఫ్యూజన్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. ఎలాగో అన్ని యూపీఐ యాప్స్‌లో ట్రాన్సాక్షన్స్‌ ఉచితమే కాబట్టి వీలైనంత వరకు ఒకే యాప్‌ను ఉపయోగించేందుకు ప్రయత్నించాలి.

ఇవి కూడా చదవండి

* ఇటీవల మెసేజ్‌ల ద్వారా యూపీఐ నుంచి డబ్బులు కొట్టేస్తున్న సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఫోన్‌కు వచ్చే ఎలాంటి లింక్‌లను పొరపాటున కూడా క్లిక్‌ చేయకూడదు. ఒకటికి రెండు సార్లు వచ్చిన మెసేజ్‌ను చెక్‌ చేసుకున్న తర్వాతే లింక్‌లపై క్లిక్‌ చేయాలి. అనవసరమైనవిగా కనిపిస్తే వాటికి జోలికి వెళ్లకూడదు.

* ఫోన్‌ స్క్రీన్‌కు కచ్చితంగా లాక్‌ పెట్టుకోవాలి. ఒకవేళ ఫోన్‌ పొగొట్టుకున్న లేదా, దొంగల చేతుల్లోకి వెళ్లినా ఫోన్‌ ఓపెన్‌ చేసే వీలుండదు. అలాగే యూపీఐ పేమెంట్ యాప్‌లకు సైతం ఫింగర్‌ ప్రింట్‌ వంటి హై ఎండ్‌ సెక్యూరిటీని సెట్ చేసుకోవాలి.

* యూపీఐ పిన్‌ను ఎవరితోనూ పంచుకోకూడదు. మీకు తెలిసిన వారైన సరే పిన్‌ను చెప్పకూడదు. అలాగే యూపీఐ పిన్‌ను ఫోన్‌లో సేవ్‌ చేసుకోకూడదు. దీనివల్ల ఫోన్‌ ఎవరిచేతుల్లోకైనా వెళితే డబ్బులు పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..