EPFO ఖాతాదారులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇక వాట్సాప్‌లోనూ పీఎఫ్‌ సేవలు.. ఎప్పటినుంచంటే?

తన చందాదారులకు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) త్వరలోనే అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పబోతుంది. చందాదారులతో కమ్యూనికేషన్‌ను మరింత మెరుగుపరచడానికి, పీఎఫ్ సంబంధిత సేవలను సులభతరం చేసేందుకు వాట్సాప్ ద్వారా సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు EPFO తెలిపింది.

EPFO ఖాతాదారులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇక వాట్సాప్‌లోనూ పీఎఫ్‌ సేవలు.. ఎప్పటినుంచంటే?
Epfo Whatsapp Service

Updated on: May 20, 2026 | 9:03 AM

తన చందాదారులకు ఈపీఎప్‌వో అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే వాట్సాప్‌లో ఈపీఎఫ్‌వో సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు పేర్కొంది. సభ్యులతో సమాచార మార్పిడిని మెరుగుపరచడం, ప్రావిడెంట్ ఫండ్ సంబంధిత సేవలను సులభంగా పొందేలా చేయడం లక్ష్యంగా ఈ సేవలను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే ఈపీఎఫ్ఓ ఖాతాదారులు నేరుగా తమ పీఎఫ్ బ్యాలెన్స్ వాట్సాప్‌లోనే చెక్‌ చేసుకోవచ్చు. అలాగే టాస్ట్ ఐదు ట్రాన్సా్క్షన్స్, క్లెయిమ్ స్టేటస్‌ను ట్రాక్ చేయడం, ఖాతాలకు లింక్ అయిన పెండింగ్ పనులపై అప్‌డేట్‌లను పొందడం వంటి సేవలను వాట్సాప్‌లోనే పొందవచ్చు. ఇందుకోసం వాట్సాప్‌లో చాట్‌బాట్ అందుబాటులోకి ఉంటుంది. చాలా మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు వాట్సాప్ గురించి ఇప్పటికే బాగా తెలుసు కాబట్టి, ఇది ఒక ప్రభావవంతమైన కమ్యూనికేషన్ ఛానెల్‌గా మారుతుందని ఈపీఎఫ్ఓ నమ్ముతోంది.

పీఎఫ్‌ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ వెరిఫైడ్ వాట్సాప్ నంబర్‌కు జస్ట్‌ Hello అని మెసేజ్ చేయడం ద్వారా ఈ సేవలను ఉపయోగించుకోచ్చు. అంతేకాకుండా, సభ్యులు తమకు నచ్చిన భాషలో సంభాషించేలా ప్రాంతీయ, స్థానిక భాషలలో కూడా ఈ సేవలను అందించాలని సంస్థ యోచిస్తోంది. దీని కోసం ఆటోమేటెడ్ సిస్టమ్స్ 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. దీనివల్ల సభ్యులు ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం తగ్గడమే కాకుండా, కాల్ సెంటర్లపై భారం కూడా తగ్గుతుంది.

ఇది ఎలా పనిచేస్తుంది?

  • మొదటగా సభ్యుడు సహాయం కోరుతూ ఈపీఎఫ్ఓకు వాట్సాప్ మెసేజ్ పంపాలి, లేదా ఏదైనా పెండింగ్ పని ఉంటే ఈపీఎఫ్ఓ సంస్థే నేరుగా సభ్యుడికి మెసేజ్ పంపుతుంది.
  • ఈ మెసేజ్ అనేది మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) కు లింక్ అయి ఉన్న రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచే వచ్చిందా లేదా అని ఈపీఎఫ్ఓ తనిఖీ చేస్తుంది. ధృవీకరణ పూర్తయిన తర్వాత, స్థానిక భాషలో కొన్ని సులభమైన మెనూ ఆప్షన్లు కనిపిస్తాయి.
  • ఇప్పుడు మీకు కావలసిన మెనూ ఆప్షన్‌ను ఎంచుకుని, వివరాలను సమర్పించాలి లేదా అడిగిన సాధారణ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి.
  • మీరు ఏదైనా ప్రశ్ని అడిగితే ఆ మెసేజ్ ప్రాసెస్ చేయబడి, AI ఆధారిత చాట్‌బాట్ ద్వారా నేరుగా లేదా ఈపీఎఫ్ఓ డేటాబేస్ ద్వారా వెతికి సభ్యుడికి సమాధానం ఇవ్వబడుతుంది.
  • మొత్తంగా, ఈ మొబైల్ ఆధారిత విధానం సభ్యుల సేవలను వేగవంతం చేయడానికి, ఈపీఎఫ్ఓ కార్యాలయాలకు వెళ్లే అవసరాన్ని తగ్గించడానికి, కస్టమర్ కేర్/కాల్ సెంటర్ల పై ఒత్తిడిని తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us