
పీఎఫ్ ఉద్యోగులకు శుభవార్త. వడ్డీ అకౌంట్లలో ఎప్పుడు పడుతుందనే విషయంపై క్లారిటీ వచ్చింది. పీఎఫ్ వడ్డీని ఈ ఏడాది మార్చిలో ఈపీఎఫ్‌వో ఖరారు చేసింది. మూడు నెలలు గడుస్తున్నా ఇంకా అకౌంట్లలో జమ కాలేదు. దీంతో వడ్డీ డబ్బులు ఎప్పుడు వస్తాయా? అని ఖాతాదారులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎప్పటికప్పుడు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకుంటున్నారు. జూన్ నెల కూడా మరికొద్ది రోజుల్లో ముగియనుండటంతో.. త్వరలోనే పీఎఫ్ వడ్డీ జమ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఎప్పుడు పడుతుందనేది ఒకసారి చూద్దాం.
జూన్ చివరి వారం లేదా జులై మొదటి వారంలో పీఎఫ్ వడ్డీ ఖాతాదారుల అకౌంట్లలో జమ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. గత కొన్నేళ్ల పేమెంట్ హిస్టరీ గమనిస్తే ఈ విషయం తెలుస్తుంది. గత ఏడాది మే నెలలో పీఎఫ్ వడ్డీ జమకు సంబంధించి కేంద్ర ఆర్దికశాఖ నుంచి ఆమోదం లభించగా.. ఈపీఎఫ్‌వో జూన్‌లో అకౌంట్ల అప్డేషన్ మొదలుపెట్టింది. అనంతరం జులై ఆఖరి నాటికి అందరి అకౌంట్లలో జమ చేయనుంది. దీంతో ఈ సారి కూడా అదే విధానంలో జమ చేయనుందని తెలుస్తోంది. ఇంకా ఆర్ధికశాఖ నుంచి ఆమోదం రావాల్సి ఉంది. త్వరలోనే ఆర్ధికశాఖ నుంచి ఆమోదం లభించనుండగా.. అనంతరం పీఎఫ్ సంస్థ ఉద్యోగుల పీఎఫ్ అకౌంట్లలో క్రెడిట్ చేయనుంది. జులై చివరికల్లా అందరి అకౌంట్లలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
దాదాపు 7 కోట్ల మంది పీఎఫ్ ఖాతాలు ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్నాయి. వీరందరికీ వడ్డీ జమ చేయాలంటే అకౌంట్ అప్డేషన్లు అనేది ముఖ్యం. కాంట్రిబ్యూషన్స్, విత్ డ్రాయల్స్, ట్రాన్స్ ఫర్స్ అన్నీ లెక్క గట్టి వేయాలంటే టైమ్ పడుతుంది. దీంతో కొద్ది రోజుల సమయం పడుతుందని అంటున్నారు. అయితే ఆలస్యంగా క్రెడిట్ చేయడం వల్ల ఎలాంటి నష్టం జరగదని నిపుణులు చెబుతున్నారు. పాస్‌బుక్‌లో ఇప్పటికే వడ్డీ ఎంట్రీ అనేది కనిపించింది. పాస్ బుక్‌లో ప్రింట్ అవ్వడానికి అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల ఆలస్యమవుతుంది. దీంతో ఆలస్యమైనా మీకు పాత వడ్డీ అందుతుంది. ఆలస్యమైనా ఎలాంటి ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నారు. పీఎఫ్ వడ్డీని ప్రతి నెలా రన్నింగ్ బ్యాలెన్స్ ఆధారంగానే లెక్కిస్తారు. కానీ అవన్నీ లెక్కించి ఏడాదికి ఒకసారి మాత్రమే ఖాతాలో జమ చేస్తారు. దీని వల్ల వడ్డీ ఆలస్యమైనా ఎలాంటి నష్టం అనేది జరగదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల పీఎఫ్ ఖాతాదారులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని అంటున్నారు.