EPFO: యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రాపై మరో అప్డేట్.. లిమిట్ విధింపు..! ఎంతవరకు తీసుకోవచ్చంటే..?

ఈపీఎఫ్‌వో తమ ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. యూపీఐ, ఏటీఎం ద్వారా పీఎఫ్ అకౌంట్లోని నగదును తీసుకునే అవకాశం కల్పించుంది. అయితే ఇందుకు కొన్ని పరిమితులు విధించింది. బ్యాలెన్స్ మొత్తాన్ని మీరు విత్ డ్రా చేసుకోలేరు. కేవలం కొంత మొత్తాన్ని మాత్రమే విత్ డ్రా చేసుకోగలుగుతారు.

EPFO: యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రాపై మరో అప్డేట్.. లిమిట్ విధింపు..! ఎంతవరకు తీసుకోవచ్చంటే..?
Epfo

Updated on: Jun 08, 2026 | 7:47 PM

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలోనే ఈపీఎఫ్‌వో 3.0 వ్యవస్థను ప్రారంభించనుంది. ఈ సిస్టమ్ ద్వారా సేవలను మరింత మెరుగుపర్చనుంది. డిజిటల్ సేవలను మరింత విస్తరించనుండగా.. మరిన్ని సడలింపులు కూడా ఇవ్వనుంది. అయితే ఈ కొత్త విధానంలో అందరూ ఎదురుచూస్తున్న అంశం యూపీఐ, ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్ డ్రా గురించే. ఎలాంటి జాప్యం, అవాంతరాలు లేకుండా వేగంగా నగదును ఉససంహరించుకోవచ్చు. త్వరలోనే ఈ సౌకర్యం రానుండగా.. ఎంతవరకు విత్ డ్రా చేసుకోవచ్చు? అనే విషయాలు తెలుసుకుందాం.

టెస్టింగ్ పూర్తి

ఈపీఎఫ్‌వో యూపీఐ సౌకర్యానికి సంబంధించి ఇప్పటికే టెస్టింగ్ పూర్తయింది. త్వరలోనే ఈ సేవలను కేంద్రం అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఇటీవల ప్రకటించారు. దీంతో రానున్న కొద్ది రోజుల్లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశముంది. దీని ద్వారా సభ్యులు క్షణాల్లోనే పీఎఫ్ నగదును మీ అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

ఎంతవరకు విత్ డ్రా చేసుకోవచ్చు..?

అయితే యూపీఐ, ఏటీఎం సౌకర్యం ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్‌లో 50 నుంచి 75 శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. గతంలో తరహలో ఎలాంటి ఆలస్యాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. తక్షణమే నిధులను విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే ఆటో సెటిల్మెంట్ పరిమితిని రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు పెంచారు. వైద్య, విద్య, వివాహం వంటి అవసరాల కోసం 72 గంటల్లోపు తమ బ్యాంకు ఖాతాల్లోకి నిధులు పొందవచ్చు. ఈ మేరకు కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చారు. ఇక ఉమాంగ్ యాప్‌లో ఫేష్ అథెంటికేషన్ ఫీచర్ తీసుకురానున్నారు. ఏఐ ఆధారిత వెరిఫికేషన్, ఓటీపీ ఆలస్యాలు, కాగితపు పని వంటివి తగ్గిపోతాయి. ఇక ఆన్‌లైన్‌లో సులువుగా వివరాలు అప్డేట్ చేసుకోవడంతో పాటు క్లెయిమ్స్ సమర్పించేందుకు వీలు కల్పిస్తోంది. ఇక స్మార్ట్ ఫోన్ నుంచి నేరుగా యూఏఎన్ యాక్టివేట్ చేసుకోవచ్చు.

యూపీఐ వ్యవస్థ ఎలా వర్క్ చేస్తుంది..?

యూపీఐ వ్యవస్థ ఎలా పనిచేస్తుందంటే.. మీ యూఏఎన్ నెంబర్‌ను బ్యాంక్ అకౌంట్‌తో అనుసంధానం చేస్తారు. దీని ద్వారా మీ అకౌంట్లలోని బ్యాలెన్స్‌ను చెక్ చేసుకుని డబ్బులు తీసుకోవచ్చు. పిన్ నెంబర్ ఎంటర్ చేసి డబ్బులు తీసుకోవాల్సి ఉంటుందని ఈపీఎఫ్‌వో వర్గాలు చేబుతున్నాయి. అలాగే ఈఫీఎఫ్‌వో ఒక ఏటీఎం కార్డును అందించనుంది. దీనిని ఉపయోగించి ఏటీఎం ద్వారా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేక ఏటీఎం కార్డులను అభివృద్ది చేస్తున్నారు.

Follow Us