Elon Musk: ఎలన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X విక్రయం.. ఎంతో తెలుసా?

|

Mar 29, 2025 | 5:54 PM

Elon Musk: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలన్ మస్క్ ఏది చేసినా అది సంచనలమే అవుతుంది. మస్క్‌ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. తాజాగా మస్క్ (X)పై మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అప్పట్లో ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన ఎలన్‌ మస్క్‌.. ఆ తర్వాత దానిని Xగా మార్చేశాడు. ఇప్పుడు సోషల్ మీడియా సైట్ అయిన Xపై సంచలన నిర్ణయం తీసుకున్నారు..

Elon Musk: ఎలన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X విక్రయం.. ఎంతో తెలుసా?
Follow us on

Elon Musk: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలన్ మస్క్ ఏం చేసిన సంచలనమే అవుతుంది. అత్యంత ధనవంతుడైన ఎలన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన మస్క్‌ Xగా మార్చేశాడు. ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ ను విక్రయించినట్లు ప్రకటించారు. అయితే అది బయటి వ్యక్తులకు మాత్రం కాదట. మస్క్ నేత్రుత్వంలోని ఏఐ (AI) సంస్థ ఎక్స్ ఏఐ (xAI)కే విక్రయించారు. మొత్తం 33 బిలియన్ డాలర్లకు విక్రయించినట్టు మస్క్ వెల్లడించారు. ఈ డీల్ మొత్తం షేర్లలోనే జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం Xకు 600 మిలియన్లకు పైగా యూజర్లు ఉన్నారు.

 

ఇవి కూడా చదవండి


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు సలహాదారుగా వ్యవహరిస్తు మస్క్.. టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవోగానూ కీలక బాధ్యతలను నిర్వహిస్తున్నారు. 2022లో ట్విట్టర్ ను మస్క్ 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తర్వాత దాని పేరును ఎక్స్ గా మార్చేశారు. ఎక్స్ ను సొంతం చేసుకున్న తర్వాత సిబ్బందిని తొలగించడం, ద్వేషపూరిత ప్రసంగాలు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

ఆర్టిఫిషియలి ఇంటలిజెన్స్‌ (AI) రంగంలో తన కొత్త స్టార్టప్ xAIలో, తన సోషల్ మీడియా X (మునుపటి ట్విట్టర్)ని విలీనం చేశారు. ఈ ఒప్పందంలో మొత్తం $33 బిలియన్ల విలువైన స్టాక్ లావాదేవీ చోటుచేసుకోగా, అందులో $12 బిలియన్లు అప్పుగా ఉంది. ఈ విలీనంతో xAI కంపెనీ విలువ అక్షరాలా $80 బిలియన్లకు చేరుకుంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి