
Elon Musk Daily Income: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజుకు రూ.1,000, రూ.2,000 సంపాదించేందుకు ఎంతో కష్టపడుతున్నారు. కానీ, ఓ వ్యక్తి మాత్రం రోజుకు సగటున రూ.8,300 కోట్ల సంపదను సృష్టిస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. టెక్ దిగ్గజం, స్పేస్‌ఎక్స్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గత ఏడాది కాలంలో భారీగా సంపదను పెంచుకున్నారు.
బెస్ట్ బ్రోకర్స్ నివేదిక ప్రకారం.. 2025 జులై నుంచి 2026 జులై మధ్య ఎలాన్ మస్క్ సంపద ఏకంగా రూ.30 లక్షల కోట్లు పెరిగింది. ఏడాది మొత్తాన్ని లెక్కలోకి తీసుకుంటే, ఆయన రోజుకు సగటున రూ.8,300 కోట్ల మేర సంపదను పెంచుకున్నట్లు నివేదిక పేర్కొంది.
2026 జూన్ 12న స్పేస్‌ఎక్స్ స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించిన సమయంలో మస్క్ సంపద భారీగా పెరిగింది. ఆ సమయంలో ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.95 లక్షల కోట్లకు పైగా చేరుకుంది. దీంతో ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. అయితే ఈ రికార్డు ఎక్కువ కాలం కొనసాగలేదు. అనంతరం స్పేస్‌ఎక్స్ షేర్లలో భారీ పతనం నమోదవడంతో మస్క్ సంపద 690 బిలియన్ డాలర్లకు తగ్గింది. దీంతో కొంతకాలం ఆయన ట్రిలియనీర్ హోదాను కోల్పోయారు.
ఇటీవల స్పేస్‌ఎక్స్ షేర్లు మళ్లీ 11.7 శాతం మేర పుంజుకోవడంతో ఎలాన్ మస్క్ నికర సంపద ప్రస్తుతం 725.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ట్రిలియనీర్ హోదా విషయంలో హెచ్చుతగ్గులు ఎదురైనా.. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఆయన అగ్రస్థానం మాత్రం కొనసాగుతోంది.
గత ఏడాది కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ రంగాలు వేగంగా అభివృద్ధి చెందడంతో పలువురు టెక్ పారిశ్రామికవేత్తల సంపద భారీగా పెరిగింది. డెల్ టెక్నాలజీస్ సీఈఓ మైఖేల్ డెల్ సంపద ఏడాది కాలంలో 107.6 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో సంపద పెరుగుదలలో ఆయన మస్క్ తర్వాత రెండో స్థానంలో నిలిచారు. అలాగే డీప్‌సీక్ వ్యవస్థాపకుడు లియాంగ్ సంపద 39.5 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో ఆయన ప్రపంచంలోని టాప్-50 అత్యంత సంపన్నుల జాబితాలోకి ప్రవేశించారు. టెక్నాలజీ, AI రంగాల్లో వేగవంతమైన వృద్ధి.. ప్రపంచ కుబేరుల సంపదను కొత్త రికార్డు స్థాయులకు తీసుకెళ్తోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: DMart Offers: రక్షాబంధన్ సందర్భంగా భారీ ఆఫర్లు.. డీమార్ట్‌లో 80 శాతం వరకు డిస్కౌంట్లు..!
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంపద కొన్ని దేశాలలోనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా 3,356 మంది బిలియనీర్లు విస్తరించి ఉన్నారు. ప్రపంచంలోని బిలియనీర్లందరిలో దాదాపు మూడింట ఒక వంతు వాటాతో యునైటెడ్ స్టేట్స్ భారీ తేడాతో అగ్రస్థానంలో ఉంది.
ఇది కూడా చదవండి: Best Scheme: మీ పిల్లల భవిష్యత్తు కోసం రోజుకు రూ.166 పొదుపు చేస్తే.. చేతికి రూ.61 లక్షలు..!
ఇది కూడా చదవండి: Electric Scooter: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సగం ధరకే.. నెలకు EMI కేవలం రూ.1,863..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి