Voter Application: కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా..? ఈసీ కొత్త రూల్స్.. ఇకపై ఆ వివరాలు తప్పనిసరి..

కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా.. అయితే మీకు అలర్ట్. ఈసీ ఆన్‌లైన్ దరఖాస్తు ఫారంలో కీలక మార్పులు చేసింది. ఫారం 6లో కొత్త విభాగం జోడించింది. గత ఎస్‌ఐఆర్‌లో మీ కుటుంబసభ్యుల వివరాలకు సంబంధించిన ఆప్షన్ ఒకటి చేర్చారు.

Voter Application: కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా..? ఈసీ కొత్త రూల్స్.. ఇకపై ఆ వివరాలు తప్పనిసరి..
Vote 5

Updated on: Jul 13, 2026 | 12:00 PM

18 ఏళ్లు దాటినవారు లేదా ఓటు హక్కును కోల్పోయినవారు కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. ఓటు కోసం ఎప్పుడైనా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం అందుబాటులో ఉంది. ఈసీ సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్లో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక కొత్త ఓటర్ దరఖాస్తు ఫారంను పూర్తి చేసి బీఎల్‌వోకు అందించడం ద్వారా ఆఫ్‌లైన్‌లోనూ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఫారం 6 పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో మీ పేరు, తండ్రి పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ లాంటి వివరాలు పూర్తి చేయడంతో పాటు అవసరమైన ప్రూఫ్స్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం తొలిసారిగా ఫారం 6గాలో కీలక మార్పులు చేసింది. ఆన్‌లైన్ అప్లికేషన్‌కు సంబంధించి ఒక కొత్త విభాగాన్ని చేర్చింది. మారిన ఈ కొత్త రూల్స్ ఏంటో ఒకసారి చూద్దాం.

ఫారం 6లో కొత్త ఆప్షన్

ఫారం 6లో ఈసీ కొత్త విభాగం చేర్చింది. ఇక నుంచి ఓటర్ల జాబితాలోని చివరి SIR ప్రకారం దరఖాస్తుదారుడి తల్లిదండ్రుల హోదా గురించి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇది కేవలం ఆన్‌లైన్ ఫారానికి మాత్రమే వర్తిస్తుండగా.. ఆఫ్‌లైన్ ఫారంలో ఈ వివరాలు లేవు. 2025 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(SIR) ప్రక్రియకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 10 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఓటర్ల జాబితాల నుంచి 55.8 లక్షలకు పైగా పేర్లను తొలగించింది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో కొత్త దరఖాస్తులకు సంబంధించి నిబంధనల్లో మార్పులు చేసింది. కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకునేవారిపై ఇది ప్రభావం చూపనుంది.

కుటుంబసభ్యుల ఎస్‌ఐఆర్ వివరాలు

ఫారం 6లో J, K విభాగాల మధ్య ఒక కొత్త భాగాన్ని చేర్చారు. ఈ విభాగంలో మూడు ఎంపికలు కనిపిస్తాయి. “గత SIR ఓటర్ల జాబితాలో నా పేరు ఉంది. గత SIR జాబితాలో నా పేరు గానీ, నా తల్లిదండ్రుల పేరు గానీ లేదు..గత SIR జాబితాలో నా తల్లిదండ్రులు, పూర్వీకుల పేర్లు ఉన్నాయి” అనే ఆప్షన్లు కనిపిస్తాయి. దరఖాస్తుదారుడు వీటిని పూర్తి చేస్తే కానీ తదుపరి స్టెప్‌కు వెళ్లగలుగుతారు. 2025-26లో SIR పూర్తయిన లేదా ప్రస్తుతం పూర్తి అవుతున్న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆన్‌లైన్ పోర్టల్‌లో దరఖాస్తుదారులకు ఈ నిబంధన కనిపిస్తుంది. దరఖాస్తుదారుడు “తన తల్లిదండ్రుల పేర్లు గత SIRలో లేవు” అని ఎంచుకుంటే.. వారి దరఖాస్తు పరిశీలన లేదా ప్రాసెసింగ్‌పై దాని ప్రభావం ఎలా ఉంటుందనేది ఈసీ స్పష్టం చేయలేదు.

Loading...
Unable to load recommendations.
Follow Us