
New Income Tax Rules: సాధారణంగా కొత్త పన్ను విధానం (New Tax Regime)లో పెట్టుబడులపై రాయితీలు ఉండవు కాబట్టి, ఎక్కువ జీతం ఉన్నవారు భారీగా పన్ను కట్టాల్సి వస్తుందని అందరూ భావిస్తారు. ఉదాహరణకు, ఒక వ్యక్తికి రూ. 20 లక్షల వార్షిక ఆదాయం ఉంటే, కనీసం లక్ష రూపాయలకు పైగా పన్ను కట్టాల్సి ఉంటుంది.
అయితే, టాక్స్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీ శాలరీ ప్యాకేజీని సరిగ్గా ‘స్ట్రక్చర్’ చేసుకోవడం ద్వారా రూ. 20 లక్షల జీతంపై కూడా ఒక్క రూపాయి పన్ను కట్టకుండా సేవ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
ఇది కూడా చదవండి: Gold, Silver Prices: ఏకంగా రూ.48,000 వరకు పడిపోయిన బంగారం ధర.. మరింత దిగజారిన వెండి!
మీ కంపెనీ ఇచ్చే జీతంలో కొన్ని భాగాలను పన్ను మినహాయింపు ఉన్న విభాగాలలో చేర్చడాన్ని శాలరీ స్ట్రక్చరింగ్ అంటారు. మీ బేసిక్ పే (Basic Pay) 50% (అంటే రూ. 10 లక్షలు) ఉంటే, మిగిలిన మొత్తాన్ని ఈ కింది విధంగా ప్లాన్ చేయవచ్చు.
చాలా కంపెనీలు భోజన సౌకర్యం కోసం కూపన్లు లేదా కార్డ్స్ అందిస్తాయి. వీటిని ఉపయోగించుకోవడం ద్వారా ఏడాదికి సుమారు రూ. 1.05 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.
PF: మీ బేసిక్ జీతంలో 12% కంపెనీ తరపున ప్రావిడెంట్ ఫండ్ (PF)కు జమ చేస్తే అది పన్ను పరిధిలోకి రాదు.
NPS: కంపెనీ మీ బేసిక్ జీతంలో 14% వరకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో ఇన్వెస్ట్ చేస్తే, దానిపై కూడా పూర్తి మినహాయింపు ఉంటుంది.
ఈ రెండింటి ద్వారా కలిపి దాదాపు రూ. 2.6 లక్షల వరకు పన్ను ఆదా చేయవచ్చు.
పన్ను ఆదా చేయడంలో ఇది అత్యంత కీలకమైన అంశం. మీరు కంపెనీ ద్వారా కార్ లీజుకు తీసుకుంటే ఆ లీజు వాయిదాలు (Installments) నేరుగా మీ జీతం నుండి కట్ అవుతాయి. ఈ మొత్తంపై మీరు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. దీని ద్వారా దాదాపు రూ. 4.23 లక్షల వరకు మీ ఆదాయాన్ని పన్ను పరిధి నుండి బయటకు తీసుకురావచ్చు.
గమనిక: ఒకవేళ మీరు కార్ లీజు ప్రయోజనాన్ని పొందకపోతే మీ పన్ను ఆదాయం రూ. 15.59 లక్షలుగా ఉంటుంది. అప్పుడు మీరు సుమారు రూ. 1.18 లక్షల వరకు పన్ను కట్టాల్సి వస్తుంది.
మీరు మీ కంపెనీలోని హెచ్ఆర్ (HR) లేదా ఫైనాన్స్ విభాగాన్ని సంప్రదించి, మీ శాలరీ ప్యాకేజీలో పైన పేర్కొన్న ‘టాక్స్-ఫ్రీ’ కాంపోనెంట్స్ ఉండేలా మార్పులు చేయమని కోరవచ్చు. ఇలా చేయడం ద్వారా చట్టబద్ధంగా మీ ఆదాయంపై భారీగా పన్ను ఆదా చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి