E-commerce: నాలుగు రోజులు.. 2.7 బిలియన్ డాలర్ల ఈ-కామర్స్ అమ్మకాలు..

|

Oct 10, 2021 | 10:00 PM

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియాతో సహా ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్స్ ద్వారా 2.7 బిలియన్ డాలర్ల(రూ. 20250 కోట్లు) అమ్మకాలను జరిగాయి. ఈ సంవత్సరం పండుగ అమ్మకాల మొదటి వారంలో 4.8 బిలియన్ డాలర్ల స్థూల సరుకుల విలువ దాటినట్లు మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ రెడ్‌సీర్ అంచనా వేసింది..

E-commerce: నాలుగు రోజులు.. 2.7 బిలియన్ డాలర్ల ఈ-కామర్స్ అమ్మకాలు..
E Commars
Follow us on

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియాతో సహా ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్స్ ద్వారా 2.7 బిలియన్ డాలర్ల(రూ. 20250 కోట్లు) అమ్మకాలను జరిగాయి. ఈ సంవత్సరం పండుగ అమ్మకాల మొదటి వారంలో 4.8 బిలియన్ డాలర్ల స్థూల సరుకుల విలువ దాటినట్లు మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ రెడ్‌సీర్ అంచనా వేసింది. “గత సంవత్సరం కంటే పండుగ అమ్మకాలు ఎక్కువ కాలం కొనసాగాయని తెలిపింది. తాము ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో $ 2.7 బిలియన్ అమ్మకాలను గమనించామమని రాబోయే 5 రోజుల్లో మరో 2.1 బిలియన్ డాలర్లను మేము ఆశిస్తున్నాము “అని రెడ్‌సీర్ అసోసియేట్ భాగస్వామి ఉజ్వల్ చౌదరి అన్నారు.

ఇది గత సంవత్సరం కంటే 23 శాతం వృద్ధిని సాధించింది. రెడ్‌సీర్ నివేదిక అంచనా ప్రకారం 75% పైగా కస్టమర్లు గతంతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువ కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొబైల్స్, పెద్ద ఉపకరణాలు, అందం, ఫ్యాషన్ వంటి ఎక్కువగా కొనుగోలు చేశారని తెలిపింది. కొనుగోలుదారులు స్మార్ట్‌ఫోన్స్‌, గృహోపకరణాలు, బ్యూటీ, ఫ్యాషన్‌ ఉత్పత్తులను భారీగా కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ-కామర్స్‌ సంస్థల ఫెస్టివల్‌ సేల్‌లో కేవలం ఐదు రోజుల్లో సుమారు 20 లక్షలకు పైగా స్మార్ట్‌ఫోన్లను, మూడురోజుల్లో సుమారు లక్షకుపైగా స్మార్ట్‌టీవీలను ప్రముఖ చైనీస్‌ దిగ్గజం షావోమీ విక్రయించింది.

మొదటి నాలుగు రోజుల అమ్మకాలలో 50శాతం మేర స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు జరిగాయని రెడ్‌సీర్‌ వెల్లడించింది. మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ నిర్వహించిన సర్వేలో ఈ ఏడాది విక్రేత మనోభావాలు సమానంగా ఆశాజనకంగా ఉన్నాయని తెలిపింది. చాలా మంది అమ్మకందారులు ప్లాట్‌ఫారమ్‌లపై 10-30% తగ్గింపులను అందించాలని యోచిస్తున్నారని తెలిపింది.

Read Also… Reliance New Energy: విదేశీ కంపెనీను కొనుగోలు చేసిన రిలయన్స్‌..! పెద్ద ఎత్తున గ్రీన్‌ ఎనర్జీ రంగంలోకి..!