Gas subsidy: గ్యాస్‌ సబ్సిడీ డబ్బులు పడ్డాయా లేదా.? ఇలా చెక్‌ చేసుకోండి..

తాజాగా తెలంగాణ ప్రభుత్వం గృహ జ్యోతి పథకంలో భాగంగా గ్యాస్‌ సిలిండర్‌పై రూ. 500 సబ్సిడీ అందిస్తున్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వినియోగదారులు ముందుగా పూర్తి ధర చెల్లించి గ్యాస్‌ను కొనుగోలు చేసుకుంటే సబ్సిడీ మొత్తాన్ని వినియోగదారుల అకౌంట్‌లో జమ చేస్తారు. అయితే మనలో చాలా మంది...

Gas subsidy: గ్యాస్‌ సబ్సిడీ డబ్బులు పడ్డాయా లేదా.? ఇలా చెక్‌ చేసుకోండి..
Gas Subsidy

Updated on: Mar 03, 2024 | 5:10 PM

ఇంట్లో ఏది ఉన్నా లేకున్నా గ్యాస్‌ కనెక్షన్‌ ఉండాల్సిందే. ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతీ ఇంట్లో గ్యాస్‌ కనెక్షన్‌ ఉంటుంది. ఒకప్పుడు అయితే కట్టెల పొయ్యి వాడే వారు కానీ కాలక్రమేణా అందరూ గ్యాస్‌ను ఉపయోగిస్తున్నారు. ఇదిలా ఉంటే నిత్యవసర వస్తువుగా మారిన గ్యాస్‌ ధరలపై అందరికీ ఆసక్తి ఉంటుంది. ప్రభుత్వాలు సైతం గ్యాస్‌ సిలిండర్‌పై సబ్సిడీలు అందిస్తుంది.

తాజాగా తెలంగాణ ప్రభుత్వం గృహ జ్యోతి పథకంలో భాగంగా గ్యాస్‌ సిలిండర్‌పై రూ. 500 సబ్సిడీ అందిస్తున్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వినియోగదారులు ముందుగా పూర్తి ధర చెల్లించి గ్యాస్‌ను కొనుగోలు చేసుకుంటే సబ్సిడీ మొత్తాన్ని వినియోగదారుల అకౌంట్‌లో జమ చేస్తారు. అయితే మనలో చాలా మంది ఈ సబ్సిడీ డబ్బులు ఎలా చెక్‌ చేసుకోవాలో తెలియదు. అయితే ఆన్‌లైన్‌లో కొన్ని సింపుల్ స్టెప్స్‌ ఫాలో అయితే చాలు మీ సబ్సిడీని చెక్‌ చేసుకోవచ్చు.

* ఇందుకోసం ముందుగా http://mylpg.in/ వెబ్​సైట్‌లోకి వెళ్లాలి.

* అనంతరం రైట్ సైడ్ కనిపించే మీ ఎల్‌పీసీ ఐడి ఎంటర్ చేయమని అడుగుతుంది.

* అందులో ముందుగా మీ గ్యాస్‌ కంపెనీని సెలక్ట్‌ చేసుకోమని పాప్‌ అప్‌ బాక్స్‌ వస్తుంది. మీరు ఉపయోగించే గ్యాస్‌ కంపెనీని ఎంచుకోవాలి.

* వెంటనే కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. అక్కడ మీ ఫోన్‌ నెంబర్‌ లేదా గ్యాస్ పంపిణీ చేసే డిస్ట్రిబ్యూట‌ర్ పేరు, కస్టమర్‌ నెంబర్‌ వివరాలను ఎంటర్‌ చేయాలి.

* ఆ తర్వాత క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి సబ్‌మిట్ బటన్‌పై క్లిక్‌ చేయాలి. ఇలా చేయగానే మీకు LPG ID వ‌స్తుంది.

* ఐడీ వచ్చిన తర్వాత మళ్లీ పైన తెలిపిన వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం కుడి వైపు కనిపించే.. ఎల్‌పీజీ ఐడి అనే బాక్సులో ఎంటర్‌ చేయాలి.

* తర్వాత మీ రిజిస్టర్‌ మొబైల్ నెంబర్‌ను ఎంటర్‌ చేయండి. తర్వాత కనిపించే క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేయండి.

* దీంతో మీ రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. అది ఎంటర్‌ చేయగానే కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది.

* అక్కడ మీ ఈమెయిల్ ఐడీని ఎంటర్‌ చేసి పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ ఈమెయిల్‌కు యాక్టివేషన్‌ లింక్‌ వస్తుంది. దాన్ని క్లిక్‌ చేయగానే అకౌంట్‌ యాక్టివేట్ అవుతుంది.

* ఇక చివరిగా మళ్లీ http://mylpg.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ అకౌంట్ లోకి లాగిన్ కావాలి. ఆ తర్వాత అక్కడ వ్యూ సిలిండర్‌ బుకింగ్‌ హిస్టరీ/సబ్సిడీ ట్రాన్స్‌ఫర్డ్‌ పై క్లిక్‌ చేసి సబ్సిడీ వివరాలను తెలుసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..