
Best Coolers: ఎండలు ముదురుతున్న కొద్దీ కూలర్ల డిమాండ్ పెరుగుతుంది. అయితే చాలా మంది డెసర్ట్, పర్సనల్ లేదా టవర్ కూలర్లలో ఏది కొనాలనే విషయంలో తికమక పడుతుంటారు. ఈ మూడూ గాలిని ఇస్తాయని మనకు అనిపించినా, వీటి పనితీరు, విద్యుత్ వినియోగం, కూలింగ్ సామర్థ్యంలో చాలా తేడాలు ఉంటాయి. తప్పుడు కూలర్ ఎంచుకుంటే గది సరిగ్గా చల్లబడకపోవడమే కాకుండా, కరెంట్ బిల్లు కూడా తడిసి మోపెడవుతుంది.
డెసర్ట్ కూలర్లను అత్యంత శక్తివంతమైనవిగా పరిగణిస్తారు. ఇవి ప్రధానంగా పెద్ద గదులు లేదా హాల్స్ కోసం డిజైన్ చేశారు. ఇందులో పెద్ద వాటర్ ట్యాంక్, శక్తివంతమైన ఫ్యాన్ ఉంటుంది. ఇది గాలిని చాలా దూరం వరకు విసురుతుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, పొడి వాతావరణంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. విద్యుత్ వినియోగం మిగిలిన కూలర్లతో పోలిస్తే ఇది అత్యధిక విద్యుత్‌ను వినియోగిస్తుంది. ఎందుకంటే దీని మోటార్, ఫ్యాన్ సైజు పెద్దవిగా ఉంటాయి.
ఇది కూడా చదవండి: Diesel Export Duty: కేంద్రం సంచలన నిర్ణయం.. డీజిల్ ఎగుమతి సుంకం భారీగా పెంపు
ఒకరిద్దరు ఉండే చిన్న గదుల కోసం పర్సనల్ కూలర్ సరైన ఎంపిక. దీని పని తీరు విషయానికొస్తే.. దీని కూలింగ్ రేంజ్ తక్కువగా ఉంటుంది. చిన్న ట్యాంక్, తక్కువ పవర్ ఉన్న ఫ్యాన్ ఇందులో ఉంటాయి. వీటిని ఒక చోటు నుండి మరోచోటికి సులభంగా తరలించవచ్చు. చిన్న బెడ్ రూమ్స్ లేదా స్టడీ రూమ్స్ కోసం ఇవి బెస్ట్. విద్యుత్ వినియోగం: ఇది అతి తక్కువ కరెంట్ ఖర్చు చేస్తుంది. బడ్జెట్ తక్కువలో ఉండి, తక్కువ కరెంట్ బిల్లు రావాలనుకునే వారికి ఇది ఉత్తమమైనది.
స్థలం తక్కువగా ఉన్న ఇళ్లకు టవర్ కూలర్లు సరిగ్గా సరిపోతాయి. ఇవి స్లిమ్ డిజైన్ తో చూడటానికి చాలా మోడ్రన్‌గా ఉంటాయి. ఇక పనితీరు విషయానికొస్తే.. ఇవి నిలువుగా (Vertical) ఉండి తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. వీటి కూలింగ్ సామర్థ్యం మీడియం సైజు గదులకు సరిపోతుంది. గాలిని గది అంతటా సమానంగా పంపిణీ చేయడంలో ఇవి దిట్ట. తక్కువ స్పేస్ ఉన్న అపార్ట్‌మెంట్లకు లేదా కిరాయి ఇళ్లకు ఇది మంచి ఆప్షన్. విద్యుత్ వినియోగంలో ఇది పర్సనల్ కూలర్ కంటే కొంచెం ఎక్కువ, డెసర్ట్ కూలర్ కంటే తక్కువ విద్యుత్‌ను తీసుకుంటుంది.
గది సైజు: మీ హాల్ పెద్దగా ఉంటే డెసర్ట్ కూలర్ తీసుకోండి. చిన్న గది అయితే పర్సనల్ లేదా టవర్ కూలర్ సరిపోతుంది.
ట్యాంక్ కెపాసిటీ: నీళ్లు ఎన్ని గంటల వరకు వస్తాయో చూసుకోవాలి. పదే పదే నీళ్లు నింపే పని లేకుండా పెద్ద ట్యాంక్ ఉన్నది ఎంచుకోవడం మేలు.
ఫీచర్లు: రిమోట్ కంట్రోల్, ఐస్ ఛాంబర్, హనీకోంబ్ ప్యాడ్స్ (Honeycool Pads) ఉన్న కూలర్లు ఎక్కువ కాలం మన్నుతాయి. మంచి చల్లదనాన్ని ఇస్తాయి.
ఇది కూడా చదవండి: 24K vs 22K Gold: క్యారెట్ అంటే ఏమిటి? మీ నగలకు ఏ రకమైన బంగారం ఉత్తమం.. చాలా మందికి తెలియని విషయాలు ఇవే!
ఇది కూడా చదవండి: Dubai Gold: దుబాయ్‌లో తులం బంగారం ధర ఎంతో తెలుసా? మన దేశంలోని ధరలతో పోలిస్తే ఎంత తేడా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి