Post Office: పోస్టాఫీసులో రూ.1 లక్ష డిపాజిట్ చేస్తే రూ.44,995 స్థిర వడ్డీ!

Post Office Scheme: మన దేశంలో స్టాక్ మార్కెట్ ఎంత వేగంగా ఎదిగినప్పటికీ ఇప్పటికీ కూడా ప్రజలు సాంప్రదాయ బ్యాంకులు పోస్ట్ ఆఫీస్ లోనే డబ్బులను దాచుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. డబ్బులను మదుపు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడరు. ఎన్ని రకాల స్కీములు అందుబాటులో ఉన్నప్పటికీ పోస్ట్ ఆఫీస్ పథకాల్లోనే..

Post Office: పోస్టాఫీసులో రూ.1 లక్ష డిపాజిట్ చేస్తే రూ.44,995 స్థిర వడ్డీ!
Post Office Scheme

Updated on: Jan 14, 2026 | 11:15 AM

Post Office: ఒకవైపు RBI వడ్డీ రేట్లను తగ్గించిన తర్వాత అనేక బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌ (FD)పై వడ్డీ రేట్లను తగ్గించగా, మరోవైపు, పోస్ట్ ఆఫీస్ కస్టమర్లు మునుపటిలాగే వారి పొదుపు ఖాతాలపై బంపర్ వడ్డీని పొందుతారు. జనవరి 1 నుండి ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ, చివరి త్రైమాసికానికి పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలపై ఇచ్చిన వడ్డీ రేట్లలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎటువంటి మార్పులు చేయలేదు. మరి ఈ పథకం గురించి తెలసుకుందాం. దీనిలో మీరు కేవలం రూ. 1 లక్ష డిపాజిట్ చేయడం ద్వారా రూ. 44,995 స్థిర, భారీ వడ్డీని పొందవచ్చు.

ఇది కూడా చదవండి: Post Office Scheme: కేవలం రోజుకు రూ.200తోనే రూ.10 లక్షలు సృష్టించవచ్చు.. ఎలాగో తెలుసా?

ఇవి కూడా చదవండి

పోస్ట్ ఆఫీస్ టీడీ పథకం 7.5% వరకు వడ్డీ:

పోస్టాఫీసులో 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల కాలానికి టీడీ ఖాతాను తెరవవచ్చు. పోస్టాఫీసు టీడీ (టైమ్ డిపాజిట్) ఖాతా బ్యాంకు ఎఫ్‌డీ పథకాన్ని పోలి ఉంటుంది. ఇక్కడ మీరు డబ్బును డిపాజిట్ చేసిన తర్వాత మెచ్యూరిటీ తర్వాత వడ్డీతో పాటు పూర్తి మొత్తాన్ని పొందుతారు. బ్యాంక్ ఎఫ్‌డీల మాదిరిగానే, కస్టమర్లు టీడీలలో మెచ్యూరిటీ తర్వాత స్థిర మొత్తంలో వడ్డీని పొందుతారు. ఎటువంటి షరతులు లేవు. పోస్టాఫీసు తన కస్టమర్లకు 1 సంవత్సరం TDపై 6.9 శాతం, 2 సంవత్సరాల TDపై 7.0 శాతం, 3 సంవత్సరాల TDపై 7.1 శాతం, 5 సంవత్సరాల TDపై 7.5 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

Investment Plan: కూలీ పనులు చేస్తూ కూడా లక్షాధికారి కావచ్చు.. ఇలా చేస్తే మీకు తిరుగుండదు!

1 లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే మీకు 44,995 రూపాయల స్థిర వడ్డీ:

మీరు పోస్టాఫీసులో 5 సంవత్సరాల TD పథకంలో రూ. 1,00,000 డిపాజిట్ చేస్తే, మెచ్యూరిటీ సమయంలో మీకు మొత్తం రూ. 1,44,995 లభిస్తుంది. ఇందులో రూ. 44,995 స్థిర వడ్డీ కూడా ఉంటుంది. ప్రస్తుతం దేశంలోని ఏ బ్యాంకు కూడా 5 సంవత్సరాల FD పథకంపై 7.5 శాతం వడ్డీని అందించడం లేదని గమనించాలి. అన్ని వయసుల కస్టమర్లు పోస్ట్ ఆఫీస్ టీడీ పథకం కింద ఒకే వడ్డీ రేటును పొందుతారు. అయితే సీనియర్ సిటిజన్లు సాధారణ పౌరుల కంటే 0.50 శాతం ఎక్కువ వడ్డీని పొందుతారు. చాలా బ్యాంకులు 80 ఏళ్లు పైబడిన కస్టమర్లకు ఇంకా ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి