ఇటీవల కాలంలో వ్యక్తిగత ధ్రువీకరణకు ఐడీ ప్రూఫ్‌తో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తప్పనిసరయ్యాయి. ముఖ్యంగా ఏవైనా దరఖాస్తులు పెట్టడానికి, లేకపోతే బ్యాంకులు, పోస్టాఫీసుల్లో అకౌంట్లు తీసుకోవడానికి పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు అవసరం అవుతాయి. అయితే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోల కోసం కూడా సమయాన్ని వెచ్చించడం ఇబ్బందిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి వారి కోసం కేవలం పది నిమిషాల్లోనే పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలను ఇంటికి డెలివరీ చేసేలా ప్రముఖ గ్రాసరీ డెలివరీ యాప్ బ్లింక్ఇట్ ప్రత్యేక సేవలను ప్రకటించింది. కేవలం 10 నిమిషాల్లో పాస్‌పోర్ట్-పరిమాణ ఫొటోలను నేరుగా మీ ఇంటికి డెలివరీ చేస్తామని బ్లింక్ ఇట్ సీఈఓ అల్బిందర్ ధిండ్సా ఇటీవల ప్రకటించారు. బ్లింకిట్ ఇప్పటికే డాక్యుమెంట్‌లను ప్రింట్ అవుట్స్‌ను అందిస్తుందని గుర్తు చేశారు. సరసమైన ధరలోనే వినియోగదారులకు మెరుగైన సేవలను అందిస్తున్నామని వివరించారు. ఈ నేపథ్యంలో పాస్ పోర్ట్ సైజ్ ఫొటోల కోసం బ్లింక్ఇట్ అందిస్తున్న సేవల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
‘వీసా డాక్యుమెంటేషన్, అడ్మిట్ కార్డ్‌లు లేదా చివరి నిమిషంలో అద్దె ఒప్పందాల కోసం పాస్‌పోర్ట్-పరిమాణ ఫోటోలు ఎప్పుడైనా అవసరమా? ఈ రోజు నుంచి ఢిల్లీ, గురుగ్రామ్‌లోని బ్లింకిట్ కస్టమర్‌లు 10 నిమిషాల్లో పాస్‌పోర్ట్ ఫోటోలను డెలివరీ చేస్తామని బ్లింక్ ఇట్ సీఈఓ ప్రకటించారు. ఈ సేవలను క్రమంగా అన్ని నగరాలకు అందజేస్తామని వివరించారు. కస్టమర్‌లు కిరాణా సామగ్రి లేదా గృహోపకరణాల కోసం చేసినట్లే బ్లింక్ఇట్ యాప్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు. ఆర్డర్ చేసిన తర్వాత ఫొటోలు ప్రింట్ చేసి 10 నిమిషాల్లో మీ చిరునామాకు డెలివరీ చేస్తామని బ్లింక్ఇట్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా మీకు ఫొటోలను మీకు కావాల్సిన క్వాలిటీలో ప్రింట్ చేసే సదుపాయం కూడా అందుబాటులో ఉంటుందని వివరిస్తున్నారు. అందువల్ల పాస్ పోర్టు సైజ్ ఫొటోల కోసం ప్రత్యేకంగా సమయం వెచ్చించాల్సిన అవసరం లేదని వివరిస్తున్నారు.
ముఖ్యంగా బ్లింక్ఇట్ పాస్ పోర్టు సైజ్ ఫొటోల సేవలపై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తుంది. అలాగే కస్టమర్‌లు ఎలా స్పందిస్తారో? వేచి చూస్తున్నామని బ్లింక్ ఇట్ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రజాస్పందన బాగుంటే ఈ సేవలను ఇతర నగరాలకు విస్తరిస్తామని పేర్కొంటున్నారు. ప్రస్తుతానికి ఢిల్లీ, గురుగ్రామ్‌లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఈ సేవలు నొయిడాలో అందుబాటులో ఉన్నాయో? లేదో? అనే అంశంపై ఎలాంటి స్పష్టత లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..