Bank Holiday: డిసెంబర్‌ 1న బ్యాంకులకు సెలవు ఉంటుందా? ఏయే రాష్ట్రాల్లో..

Bank Holiday: బ్యాంకు సెలవు దినం ఉన్నప్పటికీ, ఆన్‌లైన్ సేవలు పనిచేస్తూనే ఉంటాయి. మీరు ఎప్పటిలాగే ఆన్‌లైన్ చెల్లింపులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇతర ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఫీచర్‌లను ఉపయోగించుకోవచ్చు. బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించాల్సిన అవసరం లేకుండా మీ పనిని పూర్తి చేయడానికి..

Bank Holiday: డిసెంబర్‌ 1న బ్యాంకులకు సెలవు ఉంటుందా? ఏయే రాష్ట్రాల్లో..

Updated on: Nov 30, 2025 | 3:51 PM

Bank Holiday: ఈరోజు నవంబర్ చివరి రోజు. రేపు డిసెంబర్ ప్రారంభం. సంవత్సరంలో ఈ చివరి నెలలో బ్యాంకులు సెలవులతో నిండి ఉంటాయి. మీరు ఏదైనా బ్యాంకింగ్ సంబంధిత పని కోసం డిసెంబర్‌లో బ్యాంకు శాఖను సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే, మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించిన సెలవుల జాబితాను తనిఖీ చేయాలి. మీరు సోమవారం డిసెంబర్ 1న బ్యాంకుకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే, బ్యాంకులు మూసి ఉంటాయా? తెలుసుకోండి. మరి ఎక్కడెక్కడ బ్యాంకు బంద్‌ ఉంటాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

డిసెంబర్ 1 బ్యాంకు సెలవు:

డిసెంబర్ 1 సోమవారం అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లలో బ్యాంకులు మూసి ఉంటాయి. ఎందుకంటే అక్కడ రాష్ట్ర స్థాపన దినోత్సవం, స్వదేశీ విశ్వాస దినోత్సవం కారణంగా బ్యాంకులకు సెలవులు ఉంటుంది. ఈ ప్రాంత వాసులు బ్యాంకును సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే మీ ప్రణాళికలను మార్చుకోవాలి లేదా అసౌకర్యాన్ని ఎదుర్కోవాలి. ఈ రెండు రాష్ట్రాలు మినహా, దేశంలోని మిగిలిన ప్రాంతాలలో బ్యాంకులు యథావిధిగా తెరిచి ఉంటాయి.

ఆర్‌బిఐ విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం, డిసెంబర్‌లో వివిధ కారణాల వల్ల బ్యాంకులు దాదాపు 18 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. బ్యాంకులకు సెలవులు ఉన్న రోజుల్లో ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

ఇవి కూడా చదవండి

బ్యాంకు సెలవు దినం ఉన్నప్పటికీ, ఆన్‌లైన్ సేవలు పనిచేస్తూనే ఉంటాయి. మీరు ఎప్పటిలాగే ఆన్‌లైన్ చెల్లింపులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇతర ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఫీచర్‌లను ఉపయోగించుకోవచ్చు. బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించాల్సిన అవసరం లేకుండా మీ పనిని పూర్తి చేయడానికి మీరు ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Bank Account: మీరు బ్యాంకు అకౌంట్‌ మూసివేస్తున్నారా? ఈ 3 తప్పులు అస్సలు చేయకండి.. నష్టపోతారు!

ఇది కూడా చదవండి: Chanakya Niti: చాణక్య నీతి.. ఈ 5 లక్షణాలు ఉన్న స్త్రీలు ఇంటి లక్ష్మి అవుతారు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి