AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Debt: లక్షల్లో అప్పులు ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు.. సింపుల్‌గా తీర్చేసే బెస్ట్ ఐడియా ఇది

అప్పులు మిమ్మల్ని వెంటాడుతున్నాయా? అప్పు తీర్చడానికి మరో అప్పు చేస్తున్నారా? అయితే మీరు 'రెడ్ జోన్'లో ఉన్నట్లే! ఆదాయం కంటే వడ్డీలే ఎక్కువగా ఉన్నప్పుడు అనుసరించాల్సిన వ్యూహాలేంటి? ఆస్తుల కంటే అప్పులే వేగంగా పెరుగుతాయన్న చేదు నిజాన్ని గ్రహించి, అప్పుల రహిత జీవితం వైపు అడుగులు వేయడం ఎలాగో ఈ కథనంలో తెలుసుకోండి.

Debt: లక్షల్లో అప్పులు ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు.. సింపుల్‌గా తీర్చేసే బెస్ట్ ఐడియా ఇది
Loan India
Ravi Kiran
|

Updated on: May 09, 2026 | 11:28 AM

Share

అప్పు.. ఇది చాలా మంది జీవితాల్లో ఒక ఆరని నిప్పు లాంటిది. అవసరానికి ఆదుకునే ఆసరాగా మొదలై, అదుపు తప్పితే మొత్తం జీవితాన్ని దహించివేసే స్థాయికి చేరుకుంటుంది. నేటి కాలంలో క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లు, ఈఎంఐల మోజులో పడి తెలియకుండానే అప్పుల వలయంలో చిక్కుకుపోతున్న వారు ఎందరో ఉన్నారు. అసలు అప్పు ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది? ఆ ఊబి నుంచి బయటపడటం ఎలా? అనే అంశాలపై ఇప్పుడు చర్చిద్దాం. అప్పు తీసుకోవడం అనేది ఒక సాధారణ ప్రక్రియ. కానీ, ఆ అప్పు తీర్చడానికి మరో అప్పు చేస్తున్నారంటే మాత్రం మీరు ప్రమాదంలో ఉన్నట్టే లెక్క. ఆదాయం పెరుగుతున్నంత కాలం అప్పులను నిర్వహించడం సులభంగానే అనిపిస్తుంది.

ఇది చదవండి: 10 వేల EMIతో 30 లక్షల ఇల్లు కొనుక్కోవడం ఎలా.? ఇది తెలియక చాలామంది..

కానీ, ఆదాయ మార్గాలు తగ్గి అప్పులు మాత్రం పెరుగుతుంటే అది తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. ముఖ్యంగా స్నేహితులు, బంధువుల వద్ద తీసుకునే అప్పులు లేదా అధిక వడ్డీకి తెచ్చే బయటి అప్పులు వ్యక్తిగత సంబంధాలను కూడా దెబ్బతీస్తాయి. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం కొంతవరకు సురక్షితమైన పద్ధతి. ఎందుకంటే బ్యాంకులు మీ తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని బట్టి మాత్రమే రుణం ఇస్తాయి. కానీ, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు లేదా ప్రైవేట్ వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తీసుకోవడం వల్ల వడ్డీ చక్రవడ్డీగా మారి కొండలా పెరుగుతుంది. కాబట్టి, రుణం తీసుకునే ముందే మీ అర్హతను, అవసరాన్ని బేరీజు వేసుకోవడం చాలా ముఖ్యం.

ఇవి కూడా చదవండి

అప్పుల బాధతో కుంగిపోకుండా, బాధ్యతగల వ్యక్తిగా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. అప్పు తీర్చడానికి మరో అప్పు చేయవద్దు. కొత్త అప్పులు చేయడం పూర్తిగా ఆపివేయండి. ఇది మీ సమస్యను పెంచుతుందే తప్ప తగ్గించదు. ఒకవేళ అప్పును చెల్లించలేకపోతే మీకు అప్పు ఇచ్చిన వారితో నేరుగా మాట్లాడండి. మీ పరిస్థితిని వివరించి, ఒక ఒప్పందం ప్రకారం నెమ్మదిగా చెల్లించే అవకాశం అడగండి. అధిక వడ్డీ అప్పులకే తొలి ప్రాధాన్యతగా తీసుకోండి. ఏ అప్పుకు వడ్డీ ఎక్కువగా ఉందో దానిని ముందుగా క్లియర్ చేయండి.

ఆస్తుల కంటే అప్పే వేగంగా పెరుగుతుంది. చాలా మంది తమకున్న స్థలాలు లేదా నగలను అమ్మడానికి ఇష్టపడరు. కానీ ఆ ఆస్తి విలువ పెరిగే వేగం కంటే, అప్పు వడ్డీ పెరిగే వేగం చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, అవసరమైతే ఆస్తులు అమ్మేయైనా సరే అప్పులు తీర్చి ‘జీరో’ స్థాయికి రావడం ఉత్తమం. 5-10 శాతం రాబడి ఇచ్చే చిట్టీలు లేదా ఇతర పెట్టుబడుల కోసం 20-30 శాతం వడ్డీ చెల్లించడం మూర్ఖత్వం. ఇన్సూరెన్స్ తప్ప మిగిలిన పెట్టుబడులన్నీ ఆపేసి, ఆ డబ్బును అప్పులు తీర్చడానికే వాడండి.

ఒక కళ్లు తెరిపించే ఉదాహరణ..

కోవిడ్ సమయంలో ఒక చిట్ ఫండ్ నిర్వాహకురాలి పరిస్థితిని గమనిస్తే అప్పుల తీవ్రత అర్థమవుతుంది. కట్టవలసిన వారు డబ్బులు కట్టకపోవడంతో ఆమె అప్పు 22 లక్షలకు చేరింది. ఆమె భర్త ఆదాయం నెలకు 30 వేలు అయితే, ఆమె కట్టాల్సిన వడ్డీలే నెలకు 50 వేలు అయ్యాయి. ఇటువంటి పరిస్థితులు కేవలం ఆర్థికంగానే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. జీవితం అప్పుల కంటే చాలా విలువైనది. అప్పులు తీర్చడం అనేది ఒక ప్రక్రియ మాత్రమే. అవసరమైతే ఉన్న ఆస్తులను వదులుకుని అయినా సరే, అప్పులు లేని ‘సున్నా’ స్థాయికి చేరుకోండి. అక్కడి నుండి ప్రశాంతంగా మీ ఆర్థిక ప్రయాణాన్ని మళ్ళీ మొదలుపెట్టవచ్చు. గుర్తుంచుకోండి, ప్రశాంతమైన నిద్ర కంటే పెద్ద ఆస్తి మరొకటి లేదు!

ఇది చదవండి: అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొన్న 20 ఏళ్లకు ఏం జరుగుతుంది.? ఇది చాలామందికి తెలియదు..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us