Mukesh Ambani: రూ.20 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం.. అంబానీకి బెదిరింపు మెయిల్!

|

Oct 28, 2023 | 3:56 PM

ప్రప్రపంచ వ్యాప్తంగా వ్యాపారవేత్తగా మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు అంబానికి ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి హత్య బెదిరింపు వచ్చింది. సదరు వ్యక్తి ఈమెయిల్ ద్వారా రూ.20 కోట్లు డిమాండ్ చేసి, చెల్లించకుంటే చంపేస్తానని పేర్కొన్నట్లు తెలుస్తోంది. తన వద్ద అద్భుతమైన షార్ప్ షూటర్లు ఉన్నారని ఇమెయిల్‌లో పేర్కొన్టన్లు తెలుస్తోంది. అయితే ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు ప్రారంభించారు. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం.. అక్టోబర్ 27న ముఖేష్ అంబానీ ఈమెయిల్ ఐడీకి..

Mukesh Ambani: రూ.20 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం.. అంబానీకి బెదిరింపు మెయిల్!
Mukesh Ambani
Follow us on

భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్తలలో ఒకరైన ముఖేష్ అంబానీ. ఆయన సంపద రోజురోజుకు పెరిగిపోతోంది. భారత్‌లోనే కాకుండా ప్రప్రపంచ వ్యాప్తంగా వ్యాపారవేత్తగా మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు అంబానికి ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి హత్య బెదిరింపు వచ్చింది. సదరు వ్యక్తి ఈమెయిల్ ద్వారా రూ.20 కోట్లు డిమాండ్ చేసి, చెల్లించకుంటే చంపేస్తానని పేర్కొన్నట్లు తెలుస్తోంది. తన వద్ద అద్భుతమైన షార్ప్ షూటర్లు ఉన్నారని ఇమెయిల్‌లో పేర్కొన్టన్లు తెలుస్తోంది. అయితే ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు ప్రారంభించారు.

పోలీసులకు అందిన సమాచారం ప్రకారం.. అక్టోబర్ 27న ముఖేష్ అంబానీ ఈమెయిల్ ఐడీకి ఈమెయిల్ వచ్చింది. ఈ మెయిల్‌లో ముఖేష్ అంబానీని డబ్బు డిమాండ్ చేశాడు. ఇవ్వకుంటే చంపేస్తామని ఇంగ్లీషులో రాసి ఉంది. ఈ విషయాన్ని ముఖేష్ అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ పోలీసులకు సమాచారం అందించారు. ముంబైలోని గామాదేవి పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై ఐపీసీ సెక్షన్లు 387, 506 (2) కింద కేసు నమోదు చేశారు. ఈ కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీలకు ఇంతకుముందు కూడా హత్య బెదిరింపులు వచ్చాయి.

ఇక 2021 సంవత్సరంలో అంబానీ నివాసం ఆంటీలియా సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన ఓ స్కార్పియో కారును నిలిపి ఉంచడం అప్పట్లో పెద్ద కలకలం సృష్టించింది. ఈ ఘటన జరిగిన వారం రోజులకే స్కార్పియో యజమాని మన్‌సుఖ్ హీరేన్ అనుమానాస్పద రీతిలో చనిపోవడం సంచలనంగా మారింది. ఈ కేసులను తొలుత ఇన్‌స్పెక్టర్ సచిన్ వాజే దర్యాప్తు చేపట్టగా.. తర్వాత ఆయనే ప్రధాన సూత్రధారిగా తేలడం గమనార్హం. దీంతో ఎన్ఐఏ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ ఘటన తర్వాత నుంచి ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వమే భద్రత కల్పిస్తోంది.

అలాగే అక్టోబర్ 6, 2022 న, అతన్ని బెదిరించిన వ్యక్తిని బీహార్‌ లో అరెస్టు చేశారు. నిందితుడిని 30 ఏళ్ల రాకేష్ కుమార్ మిశ్రాగా గుర్తించారు. అక్టోబర్ 5, 2022న, నిందితులు రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి ఫోన్ చేసి అంబానీ కుటుంబాన్ని చంపుతామని బెదిరించారు. అంతేకాదు ఆసుపత్రి మొత్తం బాంబులు పెడతామంటూ బెదిరించాడు. ఈ సమయంలో పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడు నిరుద్యోగి అని పోలీసులు గుర్తించారు. అయితే తాజాగా అక్టోబర్‌ 27న అంబానీ కంపెనీకి చెందిన ఓ ఇ-మెయిల్ ఐడీకి గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈ బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపుతోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. త్వరలో పూర్తి వివరాలు రాబడుతామని పేర్కొన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి