Aadhaar Update: మీ ఆధార్ అప్‌డేటెడ్ గా ఉందా? లేకుంటే ఇప్పుడే చేసుకోండి.. లేకుంటే ఇబ్బందులు తప్పవు..

|

Sep 04, 2023 | 12:00 PM

ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఆధార్ కార్డులోని డెమోగ్రాఫిక్స్ తో పాటు అడ్రస్ లో మార్పు, ఫోన్ నంబర్ వంటివి అప్ డేట్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అది కూడా ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగానే అప్ డేట్ చేసుకోవచ్చని ప్రకటించింది. దీనికి గడువు కూడా విధించింది. తొలుత 2023, జూన్ 14 గడువు పెట్టినా.. దానిని సెప్టెంబర్ 14 వరకూ పొడిగించింది. ఆ తర్వాత మీరు అప్ డేట్ చేసుకోవాలంటే అది ఉచితం కాదు.

Aadhaar Update: మీ ఆధార్ అప్‌డేటెడ్ గా ఉందా? లేకుంటే ఇప్పుడే చేసుకోండి.. లేకుంటే ఇబ్బందులు తప్పవు..
Aadhaar Updates
Follow us on

మన దేశంలోని ప్రతి పౌరుడు ఆధార్ నంబర్ ను కలిగి ఉన్నాడు. ఈ నంబర్ లేకుంటే భారత పౌరుడిగా గుర్తింపు కూడా రాదు. ఏ పథకానికి అర్హుడు కాదు. అయితే ఆధార్ కార్డును కలిగి ఉండటం ఎంత అవసరమో దానిని అప్ డేటెడ్ గా ఉంచుకోవడం కూడా అంతే అవసరం. లేకుంటే అది అవసరమైనప్పుడు ఇబ్బందికర పరిస్థితులు కల్పించవచ్చు. అందుకే ప్రభుత్వం ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఆధార్ కార్డులోని డెమోగ్రాఫిక్స్ తో పాటు అడ్రస్ లో మార్పు, ఫోన్ నంబర్ వంటివి అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. అది కూడా ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగానే అప్ డేట్ చేసుకోవచ్చని ప్రకటించింది. దీనికి గడువు కూడా విధించింది. తొలుత 2023, జూన్ 14 గడువు పెట్టినా.. దానిని సెప్టెంబర్ 14 వరకూ పొడిగించింది. ఆ తర్వాత మీరు అప్ డేట్ చేసుకోవాలంటే అది ఉచితం కాదు. కొంత సర్వీస్ చార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. ఉచితంగా అప్ డేట్ చేసుకోవాలంటే మాత్రం ఇదే సమయం త్వరపడండి.

ఏమి అప్ డేట్ చేసుకోవాలంటే..

యూఐడీఏఐ చెబుతున్న ప్రకారం వ్యక్తుల కచ్చితమైన సమాచారం కోసం ఆధార్ వివరాలు అప్ డేట్ చేసుకోవాలి. అందులోని మీ వేలి ముద్రలు, చిరునామా, డేట్ ఆఫ్ బర్త్ వంటివి సరిగ్గా ఉన్నాయో లేవో సరిచూసి అప్ డేట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు చిరునామాను అప్ డేట్ చేసుకోవాలనుకుంటే దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్ ను కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

ఎవరు అప్ డేట్ చేసుకోవాలి..

వివాహం చేసుకున్న సందర్భాల్లో ఇంటి పేరు మార్చుకున్న మహిళలు, వారి చిరునామాలు మార్చుకోవాల్సి ఉంటుంది. ఏదైనా కొత్త ప్రాంతాలకు వలసలకు వెళ్తే మీ చిరునామాతో పాటు కొన్ని సందర్భాల్లో మొబైల్ నంబర్ కూడా మారవచచు. ఈ మెయిల్ కూడా మార్చుకోవచ్చు.

ఆన్ లైన్లో ఇలా అప్ డేట్ చేసుకోవాలి..

  • మొదటిగా మీరు https://myaadhaar.uidai.gov.in/ వెబ్ సైట్లోకి వెళ్లాలి.
  • ఆధార్ కు లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ ద్వారా వన్ టైం పాస్ వర్డ్ ఉపయోగించి లాగిన్ కావాలి.
  • మీకు కనిపించిన వివరాల్లో ఏమైనా వ్యత్యాసం ఉందేమో గమినించాలి.
  • అన్ని సరిగ్గా ఉంటే ఐ వెరిఫై థట్ అబౌవ్ డిటైల్స్ ఆర్ కరెక్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఒకవేళ మీ వివరాల్లో ఏదైనా మార్చాలి అనుకుంటే దానిలో ఐడెంటిటీ డాక్యుమెంట్ ఎంపిక చేసుకొని, దానిని జేపీఈజీ, పీఎన్జీ లేదా పీడీఎఫ్ ఫార్మాట్ లో 2ఎంబీ సైజ్ మించి పెరగకుండా అప్ లోడ్ చేయాలి.
  • అనంతరం అడ్రస్ డాక్యుమెంట్ ను కూడా అప్ లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. అంతే మీ రిక్వెస్ట్ యూఐడీఏఐకి వెళ్తుంది. దాని స్టేటస్ ను కూడా ఇదే సైట్లో మీరు తనిఖీ చేయొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..