
ఈ ఉద్యోగాలు ఏం చేస్తాం.. గొడ్డు జాకిరీ అని ఫీల్ అయ్యే చాలా మందికి ఉండే ఆలోచన ఏంటంటే.. ఒక మంచి బిజినెస్ చేయాలని. కానీ అందరికి దగ్గర పెట్టుబడికి పైసలు ఉండవు. అప్పటి వరకు జాబ్‌తో వారి చుట్టు అల్లుకుపోయిన ఖర్చులు, ఫ్యామిల రీజన్స్‌తో కొత్తగా వ్యాపారం మొదలుపెట్టి రిస్క్ చేయలేరు. అయితే రిస్క్ అయినా పర్లేదు బిజినెస్ చేయాల్సిందే అనే మొండి పట్టుదలతో కొంతమంది ఉంటారు. అలాంటి వారు మీరైతే.. మీ వద్ద కాస్త పెట్టుబడి పెట్టే స్థోమత ఉంటే ఓ సూపర్ బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
డెయిర్ ఫామ్ బిజినెస్.. చాలా మంది ఇది రైతులు చేసే పాల వ్యాపారం అనుకుంటారు. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. డెయిరీ ఫామ్ అంటే ఇప్పుడు లక్షలు కురిపించే ఓ బంగారు బాతు. సరిగ్గా ప్లాన్ చేయాలే కానీ ఇందులో చాలా డబ్బు ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న జనాభాకు పాలు, పాల ఉత్పత్తులు తీర్చడం ఆల్రెడీ ఈ వ్యాపారంలో ఉన్న వారి వల్ల అవ్వడం లేదు. పాలకు, పాల పదార్థాలకు అంత విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ డిమాండ్‌ను కాస్త తీరుస్తూ.. డబ్బు సంపాదించాలంటే డెయిరీ ఫామ్ ఇప్పుడు ఓ గోల్డెన్ ఆపర్చునిటీ.
అయితే డెయిరీ ఫామ్‌ను మరీ భారీ ఎత్తున కాకుండా ఓ 20 గేదెలతో స్టార్ట్ చేయడం మంచిది. అలాగే మీరే పూర్తిగా పని చేయాల్సిన అవసరం లేకుండా బీహార్, మహారాష్ట్ర నుంచి ఓ జంటను ఏడాదికి ఇంత అని మాట్లాడుకొని ఫామ్‌లో పనికి పెట్టొచ్చు. వారు నిత్యం అక్కడే ఉండటం వల్ల పని సాఫీగా సాగుతుంది. అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేసేందుకు షెడ్డు నిర్మాణం, గేదెల కొనుగోలు, దాణా, పని వారికి అంతా కలిపి ఓ రూ.10 లక్షలు ఆరంభ పెట్టుబడిగా అవుతుంది. సొంత భూమి ఉంటే ఓకే.. లేదంటే లీజ్‌కు తీసుకునేందుకు మరి కొంత ఖర్చు అవుతుంది. మరి మీ దగ్గర రూ.10 లక్షలు ఉన్నా, లేదా లోన్ తీసుకొని అయినా ఈ బిజినెస్‌ను ప్రారంభించి, అకింతభావంతో కష్టపడి పని చేస్తే మంచి లాభాలు చూడొచ్చు. పైగా ఈ బిజినెస్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆర్థిక సహాయం అందజేస్తాయి. వాటికి సంబంధించి ముద్రా వంటి లోన్ స్కీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి