Cyient Parental Leaves: సాధారణంగా ఏ కంపెనీ అయినా ప్రసూతి సెలవుల్లో ఎక్కువ ప్రాధాన్యత కేవలం మహిళలకు మాత్రమే ఇస్తుంది. మహిళలతో పోలిస్తే పురుషులకు తక్కువ సెలవులను ఇస్తుంటారు. అయితే తాజాగా ప్రముఖ ఐటీ సంస్థ సైయెంట్ ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జెండర్‌తో సంబంధం లేకుండా ఉద్యోగులందరికీ సమానమైన ప్రసూతి సెలవులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. పిల్లలు పుట్టిన వారికే కాకుండా చిన్నారులను దత్త తీసుకున్న వారికి కూడా ఈ సెలవులు వర్తిస్తాయని సంస్థ తెలిపింది.
సైయెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కార్యలయాల్లో పనిచేస్తోన్న వారందరికీ 12 వారాలపాటు ప్రసూతి సెలవులను ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ సమయంలో ఉద్యోగులకు పూర్తి వేతనం చెల్లిస్తామని సంస్థ తెలిపింది. సైయెంట్ ప్రెసిడెంట్ పీఎన్‌ఎస్‌వీ నరసింహం ఈ విషయమై మాట్లాడుతూ.. పనితో పాటు ఫ్యామిలీ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులైన వారికి కొన్ని దేశాల్లో ఇస్తున్న సెలవులు సరిపోవడం లేదని తెలిపిన ఆయన.. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుకే ఈ కొత్త విధానాన్ని ప్రకటించినట్లు చెప్పుకొచ్చారు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఇద్దరు సమాన బాధ్యతలు పంచుకునేందుకు ఇది తోడ్పడుతుందని సంస్థ ఎండీ కృష్ణ చెప్పుకొచ్చారు.
Song Sequence In RRR: జక్కన్ననా మజాకా.. ఒక్క సాంగ్ కోసం రూ. 3 కోట్లు ఖర్చు చేయనున్నారట..