లాక్‌‌డౌన్‌ ఎఫెక్ట్: భారీగా తగ్గిన చమురు విక్రయాలు

| Edited By:

Apr 17, 2020 | 8:50 AM

లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ విక్రయాలు భారీగా తగ్గాయి. మూడు వేలకు పైగా పెట్రోల్ బంకుల్లో రోజువారీ జరిగే అమ్మకాలు 60 శాతం..

లాక్‌‌డౌన్‌ ఎఫెక్ట్: భారీగా తగ్గిన చమురు విక్రయాలు
Follow us on

లాక్‌డౌన్ కారణంగా పరిశ్రమలు, పలు కంపెనీలు మూసి వేయగా.. కేవలం నిత్యావసర వస్తువులకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. అందులో భాగంగా చమురు ధరలకు కూడా ప్రత్యేక సమయం కేటాయిస్తూ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ విక్రయాలు భారీగా తగ్గాయి. మూడు వేలకు పైగా పెట్రోల్ బంకుల్లో రోజువారీ జరిగే అమ్మకాలు 60 శాతం కూడా జరగడం లేదు. నెల రోజులుగా అమలవుతున్న లాక్‌డౌన్‌తో నిత్యవసర సరుకులు తరలించే.. వాహనాలు తప్ప మిగితావన్నీ నిలిచిపోయాయి. ఆ ప్రభావం కాస్తా.. పెట్రోల్, డీజిల్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. పెట్రోల్ 63 శాతం, డీజిల్ 64 శాతం పడిపోయినట్లు చమురు సంస్థల లెక్కలు వెల్లడిస్తున్నాయి.

ఈ నెల ఒకటి నుంచి 14 వరకూ దాదాపు రెండు వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పెట్రోల్, డీజిల్ అమ్మకాలను పరిశీలిస్తే.. ఒక కోటి 95 లక్షల 3 వేల లీటర్లు పెట్రోల్ అమ్ముడు పోయింది. ఇదే సమయంలో గతేడాది పెట్రోల్ 5 కోట్ల 22 లక్షల 3 వేల లీటర్ల పెట్రోల్ అమ్మకాలు జరిగాయి. అంటే దాదాపు 3 కోట్ల 27 లక్షల లీటర్లు మాత్రమే చమురు వాడకం తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో సాధారణ రోజుల కంటే 62.64 శాతం మేర పెట్రోల్ విక్రయాలు తగ్గాయి.

ఈ నెల ఏప్రిల్ ఒకటి నుంచి 14వ తేదీ వరకూ 3 కోట్ల 67 లక్షల 87 వేల లీటర్లు డీజిల్ అమ్ముడు పోగా.. గతేడాది డీజిల్ 10 కోట్ల 11 లక్షల 29 వేల లీటర్లు డీజిల్ అమ్ముడు పోయింది. అంటే ఈ లెక్కన 64 శాతం అమ్మకాలు తగ్గాయి. రోజువారీగా జరగాల్సిన విక్రయాలు కూడా లేకపోవడం వల్ల పెట్రోల్ బంకుల్లో పని చేసే సిబ్బంది కూడా ఆటలు ఆడుతూ కాలయాపన చేస్తున్నారు.

Read More:  

రికార్డు సృష్టించిన బంగారం.. రూ. 47 వేలకు చేరువ

పిజ్జా డెలివరీ బాయ్‌కి కరోనా పాజిటివ్

హైదరాబాద్‌లో కరోనా పేషెంట్ అరెస్ట్.. దేశంలోనే ఫస్ట్ టైమ్

నా కాపురం నయనతార వల్లే కూలిపోయింది.. ప్రభుదేవ మాజీ భార్య ఫైర్..