కరోనా వైరస్ లేదా కోవిడ్-19.. ప్రస్తుతం ఈ పేరు వింటుంటే.. ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. దీని దెబ్బకి చైనాలో ఏకంగా 3 వేల మందికి పైగా మరణించారు. ప్రస్తుతం ఇప్పుడు మనదేశంలో కూడా 30 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. వారిలో కూడా ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యక్తులే ఉన్నారు. కరోనా ఎఫెక్టుతో ఇప్పటికే పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. రోగిని టచ్ చేసినా.. షేక్ హ్యాండ్స్ తీసుకున్నా వచ్చే ప్రమాదం ఉంది కనుక చాలా ఆఫీసులు మూతపడ్డాయి.
ఇప్పుడు దీని ప్రభావంతోనే.. ఫేస్ బుక్ సంస్థ కూడా సింగపూర్, లండన్‌లో ఉన్న తమ కార్యాలయాల్ని మూసివేసింది. ఉద్యోగుల్లో ఒకరికి కరోనా ఉందని తేలడంతో.. మొత్తం ఆఫీసునే మూసివేశారు. ఎందుకంటే.. ఇది తొందరగా వ్యాపించే వైరస్ కనుక.. మిగతావారికి కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని తెలుసుకోవడంతో.. తాజాగా శుక్రవారం లండన్‌లోని ఫేస్‌బుక్ కార్యాలయాన్ని మూసివేసింది. మళ్లీ కార్యాలయాన్ని తెరిచే వరకూ ఇంటి వద్ద నుంచే పనిచేయాల్సిందిగా ఉద్యోగులను ఆదేశించింది. అలాగే ప్రతి ఒక్కరి ఆరోగ్యం, భద్రతకు హామీ ఇస్తామని యాజమాన్యం తెలిపింది.
డాక్టర్లు, ప్రభుత్వాల సూచనలు, సలహాలు పాటిస్తామని తెలిపింది. ఫేస్ బుక్ భవనంలో వైరస్ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు వైద్య పరంగా శుద్ధి కార్యక్రమాన్ని చేపడుతున్నామని, అది పూర్తయ్యాక మళ్లీ కార్యాలయాన్ని తెరుస్తామని ఫేస్ బుక్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
Read More: దొరబాబు ఫోన్ కాల్‌కి దిమ్మతిరిగే రియాక్షన్ ఇచ్చిన రోజా!