CoinDCX: క్రిప్టో ఆస్తులపై వడ్డీ అందిస్తున్న CoinDCX.. Earn పేరుతో కొత్త ఉత్పత్తి అందుబాటులోకి..

|

May 26, 2022 | 3:49 PM

CoinDCX : దేశంలో అతిపెద్ద, అత్యంత విలువైన క్రిప్టో కంపెనీల్లో ఒకటి కాయిన్‌డిసిఎక్స్(CoinDCX). ఈ సంస్థ తన కొత్త క్రిప్టో దిగుబడి ప్రోగ్రామ్ 'ఎర్న్'ని ప్రారంభించినట్లు ఈ రోజు ప్రకటించింది.

CoinDCX: క్రిప్టో ఆస్తులపై వడ్డీ అందిస్తున్న CoinDCX.. Earn పేరుతో కొత్త ఉత్పత్తి అందుబాటులోకి..
Crypto
Follow us on

CoinDCX : దేశంలో అతిపెద్ద, అత్యంత విలువైన క్రిప్టో కంపెనీల్లో ఒకటి కాయిన్‌డిసిఎక్స్(CoinDCX). ఈ సంస్థ తన కొత్త క్రిప్టో దిగుబడి ప్రోగ్రామ్ ‘ఎర్న్’ని ప్రారంభించినట్లు ఈ రోజు ప్రకటించింది. ఇది కాయిన్‌డిసిఎక్స్ కస్టమర్లు నిరుపయోగంగా ఉన్న తమ క్రిప్టో ఆస్తులపై వడ్డీని సంపాదించేందుకు దీని ద్వారా అవకాశాన్ని కల్పిస్తోంది. ‘ఎర్న్’ ఫీచర్ ప్రస్తుతం క్రిప్టో ఇండస్ట్రీలో అత్యంత పోటీ కలిగిన ఉత్పత్తుల్లో ఒకటిగా ఉందని కంపెనీ వెల్లడించింది. దీని ద్వారా వినియోగదారులు తమ క్రిప్టో ఆస్తుల నిర్వహణలో పూర్తి భద్రత, ఫ్లెక్సిబిలిటీతో పాటు ఎటువంటి లాక్ ఇన్ పిరియడ్ లేకుండా రోజులో ఎప్పుడైనా విత్ డ్రా చేసుకునేందుకు వెసులుబాటును కల్పిస్తోంది.

వినియోగదారులు CoinDCXతో ‘ఎర్న్’ని ఎంచుకున్నప్పుడు.. CoinDCX వారి క్రిప్టో/డిజిటల్ ఆస్తులపై రాబడిని ఉత్పత్తి చేయడానికి పెద్ద సంస్థాగత రుణగ్రహీతలు, థర్డ్ పార్టీ రుణాలు ఇచ్చే భాగస్వాములు, స్టేకింగ్ ప్లాట్‌ఫారమ్‌లతో పని చేస్తుంది. దేశంలో ప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజ్‌గా.. ఉన్న CoinDCX తన వినియోగదారుల ఆస్తులను రక్షించడానికి పూర్తిగా కట్టుబడి ఉందని కంపెనీ తెలిపింది. వినియోగదారులకు సంబంధించిన నిధులు లేదా డిజిటల్ ఆస్తుల భద్రత కోసం కఠినమైన రక్షణ చర్యలను అమలు చేస్తోంది. వినియోగదారుల కోసం వినూత్న ఉత్పత్తులను, పరిష్కారాలను తమ బృందం అందుబాటులోకి తెచ్చినట్లు CoinDCX CEO, సహ-వ్యవస్థాపకుడు సుమిత్ గుప్తా వెల్లడించారు.

కాయిన్‌డిసిఎక్స్ ‘ఎర్న్’ ప్రస్తుతం వెయిట్‌లిస్ట్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంది. వెయిట్‌లిస్ట్‌లో ఎక్కువగా ఉన్న వినియోగదారులకు ప్రాధాన్యత యాక్సెస్ ఇవ్వబడుతుంది. కంపెనీ రెఫరల్ కార్యక్రమాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ముందుగా కేవైసీ ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. క్రిప్టో ఆస్తులపై ఇన్వెస్టర్లు నిర్ణీత కాలానికి రెగ్యులర్ రిటర్న్ పొందేందుకు ఈ క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (CIP)ను కంపెనీ తాజాగా ‘ఎర్న్’ పేరిట అందుబాటులోకి తెచ్చింది. మరింత సమాచారం కోసం కింద ఉన్న లిక్స్ క్లిక్ చేయండి.

For more information, visit https://coindcx.com/

To access the waitlist, visit https://coindcx.com/earn-waitlist