CNG Price Hiked: బాదుడే.. బాదుడు.. మళ్లీ పెరిగిన సీఎన్‌జీ ధర.. రెండు నెలల్లో 13వ సారి పెంపు

CNG Price Hiked: కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ధర మరింతగా పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం కిలోకు సీఎన్‌జీ ధర రూ.2లు మేర పెరిగింది. గత రెండు నెలల వ్యవధిలోనే సీ..

CNG Price Hiked: బాదుడే.. బాదుడు.. మళ్లీ పెరిగిన సీఎన్‌జీ ధర.. రెండు నెలల్లో 13వ సారి పెంపు

Updated on: May 22, 2022 | 6:39 AM

CNG Price Hiked: కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ధర మరింతగా పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం కిలోకు సీఎన్‌జీ ధర రూ.2లు మేర పెరిగింది. గత రెండు నెలల వ్యవధిలోనే సీఎన్‌జీ ధరలు పెంచడం ఇది 13వ సారి కావడం గమనార్హం. ఢిల్లీ, చుట్టుపక్కల నగరాలకు సీఎన్‌జీ, గొట్టపు వంట గ్యాస్‌ను విక్రయించే ఇంద్రప్రస్థ గ్యాస్‌ లిమిటెడ్‌ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. తాజా పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో కిలో ధర రూ.75.61కు చేరగా, మార్చి 7 నుంచి ఇప్పటివరకు మొత్తంగా 13 సార్లు పెరిగింది. కిలో సీఎన్‌జీపై మొత్తంగా రూ.19.60లు పెరిగింది. గత ఏడాది కాలంగా పరిశీలిస్తే కిలో సీఎన్‌జీపై దాదాపు రూ.32.21 లేదా 60 శాతం పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలో 1 కిలోల CNG ధర రూ. 78.17 ఉండగా, ముజఫర్‌నగర్, మీరట్, షామ్లీ రూ. 82.84, గురుగ్రామ్ రూ. 83.94, రేవారి రూ. 86.07, కర్నాల్, కైతాల్ రూ. 84.27, కాన్పూర్, హమీర్‌పూర్ రూ.87. అజ్మీర్, పాలి, రాజ్‌సమంద్‌లో కిలో రూ.85.88గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

 

Follow Us