
ఎలక్ట్రిక్ వాహనాల విభాగం రోజురోజుకూ వృద్ధి చెందుతుంది. అగ్రశ్రేణి కార్ల తయారీ సంస్థలన్నీ ఐసీఈ నుంచి నుండి ఈవీ వాహనాలవైపు వేగంగా మారుతున్నారు. కియా, మహీంద్రా, మారుతి సుజుకి, టాటా ఎంజీ వంటి కంపెనీలు కొత్త కార్లను లాంచ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రిలీజవ్వబోయే ఈవీ వార్ల గురించి తెలుసుకుందాం.
కియా క్లావిస్ ఈవీ త్వరలో లాంచ్ కానుంది. కియా కంపెనీ ఇప్పటికే ఈ మోడల్ ఇంధన వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. ఈ మోడల్‌లో భవిష్యత్‌లో ఈవీ వెర్షన్ లాంచ్ కానుందని నిపుణులు చెబుతన్నారు. ఈ మోడల్ హాట్ సెల్లింగ్ ఉత్పత్తిగా ఉంది. క్రెటా ఎలక్ట్రిక్ నుండి చాలా కీలకమైన హార్డ్‌వేర్‌ను తీసుకుంటుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి మోడల్ రెండు బ్యాటరీ కాన్ఫిగరేషన్‌లలో అందించే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు.
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ప్రదర్శించిన జేఎస్‌డబ్ల్యూ ఎంజీ ఎం9ని భారత మార్కెట్‌కు త్వరలో తీసుకురానుంది. ఎంజీ ప్రీమియం శ్రేణిలో ఉన్న ఈ కారు 90 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వస్తుంది. అలాగే ఈ కారును ఓ సారి ఛార్జ్ చేస్తే దాదాపు 430 కి.మీ. మైలేజ్ అందిస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
మహీంద్రా కంపెనీ ఎక్స్‌యూవీ 3 ఎక్స్‌ఓ కారును ఈవీ వెర్షనలో త్వరలో లాంచ్ చేయనుంది. ఈ కారు 2025 చివర్లో మార్కెట్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ లాంచ్ గురించి కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అధికారికంగా లాంచ్ అయిన తర్వాత, ఈ మోడల్ టాటా పంచ్ ఈవీకు నేరుగా పోటీగా ఉంటుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
2025 బీఎంజీఈ సమయంలో టాటా కంపెనీ హారియర్ ఈవీను ప్రదర్శించింది. టాటా కంపెనీ ఈ కారుకు సంబంధించిన అన్ని పరీక్షలను దాదాపు పూర్తి చేసిందని, త్వరలోనే హారియర్ ఈవీ మార్కెట్‌ను పలుకరించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025 ముగిసేలోపు ఈ కారు మార్కెట్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి