Citroen Basalt: ఊరిస్తున్న సిట్రోయిన్.. కొత్త బసాల్ట్‌కు సంబంధించిన మరో టీజర్.. కీలక అంశాలు బహిర్గతం..

|

Jul 23, 2024 | 6:22 PM

ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతోన్న నేపథ్యంలో కూపే ఎస్‌యూవీలు ఎక్కువగా లాంచ్ అవుతున్నాయి. లేటెస్ట్ గా ఈ మోడళ్లో టాటా కర్వ్ లాంచ్ కు సిద్ధం అయ్యింది. వచ్చే నెలలో ఇది భారతీయ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పడు ఇదే కూపే ఎస్‌యూవీ వెర్షన్లో సిట్రోయిన్ కూడా కొత్త కారును తీసుకొస్తోంది. సిట్రోయిల్ బసాల్ట్ పేరుతో దీనిని ఉత్పత్తి చేస్తోంది.

Citroen Basalt: ఊరిస్తున్న సిట్రోయిన్.. కొత్త బసాల్ట్‌కు సంబంధించిన మరో టీజర్.. కీలక అంశాలు బహిర్గతం..
Citroen Basalt
Follow us on

మన దేశంలో ఆటోమోటివ్ మార్కెట్ విస్తృత స్థాయిలో కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తోంది. వినియోగదారుల అవసరాలకు, అభిరుచికి అనుగుణంగా కొత్త తరహా వాహనాలు లాంచ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతోన్న నేపథ్యంలో కూపే ఎస్‌యూవీలు ఎక్కువగా లాంచ్ అవుతున్నాయి. లేటెస్ట్ గా ఈ మోడళ్లో టాటా కర్వ్ లాంచ్ కు సిద్ధం అయ్యింది. వచ్చే నెలలో ఇది భారతీయ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పడు ఇదే కూపే ఎస్‌యూవీ వెర్షన్లో సిట్రోయిన్ కూడా కొత్త కారును తీసుకొస్తోంది. సిట్రోయిల్ బసాల్ట్ పేరుతో దీనిని ఉత్పత్తి చేస్తోంది. దీనికి సంబంధించిన టీజర్ ను ఇప్పుడు సిట్రోయిన్ విడుదల చేసింది. కారు ఇంటీరియర్ ఎక్స్ టీరియర్ వివరాలను ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

సిట్రోయిన్ సీ3 ఎయిర్ క్రాస్ మాదిరిగానే..

ఈ కొత్త కూపే ఎస్‌యూవీ సిట్రోయిన్ బసాల్ట్ సీ3 ఎయిర్ క్రాస్ ప్లాట్ ఫారంపైనే రూపొదించారు. దీనిలో సిట్రోయిన్ సిగ్నేచర్ డిప్పింగ్ రూఫ్ లైన్ ఉంటుంది. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ సెటప్ ఉంటుంది. ఎస్‌యూవీ లైక్ పర్సనాలిటీ ఉంటుంది. డిజైన్ వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడి కాలేదు.

సిట్రోయిన్ బసాల్ట్ ఇంటీరియర్..

ఈ కారు లోపల ఫీచర్లకు సంబంధించిన కొన్ని అప్ డేట్లు విడుదల అయ్యాయి. సీ3 ఎయిర్ క్రాస్ కు మించిన రీతిలో ఇంటరీయర్ ఉంటుందని చెబుతున్నారు. ముందు, వెనుక ఆర్మ్ రెస్ట్స్, కప్ హోల్డర్లు, స్మార్ట్ ఫోన్ హోల్డర్ ఉంటుంది. 10.2 అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ స్క్రీన్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే కనెక్టివిటీ ఉంటుంది. ఇవి కాక మరిన్ని అధునాతన ఫీచర్లు ఉంటాయని కంపెనీ పేర్కొంది.

సిట్రోయిన్ బసాల్ట్ ఇంజిన్ వివరాలు..

ఈ కారులో 1.2 లీటర్ మూడు సిలెండర్ల ప్యూర్ టెక్ 110 ఇంజిన్ ఉంటుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ ఉంటుంది. అత్యధిక పనితీరు కలిగి ఉంటుంది. ఈ కారు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హ్యూదాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకీ గ్రాండ్ విటారా, టోయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వంటి కార్లతో పోటీ పడుతుంది. ఈ కారుపై మార్కెట్లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే కారు లాంచ్ డేట్ గురించి కంపెనీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందో ఇంకా తేదీ చెప్పలేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..