Alert to Citi Bank Customers: పూర్తయిన భారీ డీల్.. సిటీ బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్.. సేవలు మాత్రం యథావిధిగానే..!

సిటీ ఇండియా ఇప్పుడు తన వెబ్‌సైట్‌లో తన కస్టమర్‌లకు ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ సేవలందిస్తుందని పేర్కొంటూ సందేశాన్ని పంపింది. అయితే వినియోగదారులు ప్రస్తుతం ఉన్న అన్ని శాఖలు, ఏటీఎంలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌‌లు యథాతథంగా ఉపయోగించవచ్చని పేర్కొంది. అయితే సిటీ ఇండియా శాఖలన్నీ ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్‌గా రీబ్రాండ్ చేస్తారు.

Alert to Citi Bank Customers: పూర్తయిన భారీ డీల్.. సిటీ బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్.. సేవలు మాత్రం యథావిధిగానే..!
Axis Citi Bank

Updated on: Mar 01, 2023 | 4:00 PM

సిటీ బ్యాంక్‌కి చెందిన ఇండియా కన్జ్యూమర్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వ్యాపారాల కొనుగోలును పూర్తి చేసినట్లు యాక్సిస్ బ్యాంక్ బుధవారం ప్రకటించింది. గతేడాది ప్రకటించిన ఈ డీల్ విలువ దాదాపు రూ.11,603 కోట్లుగా ఉంది. సిటీ ఇండియా ఇప్పుడు తన వెబ్‌సైట్‌లో తన కస్టమర్‌లకు ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ సేవలందిస్తుందని పేర్కొంటూ సందేశాన్ని పంపింది. అయితే వినియోగదారులు ప్రస్తుతం ఉన్న అన్ని శాఖలు, ఏటీఎంలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌‌లు యథాతథంగా ఉపయోగించవచ్చని పేర్కొంది. అయితే సిటీ ఇండియా శాఖలన్నీ ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్‌గా రీబ్రాండ్ చేస్తారు. అయితే ఇకపై ఖాతాదారులకు మాత్రం యాక్సిస్ బ్యాంక్ సేవలను అందిస్తుంది. సిటీ బ్యాంక్, సిటీ గ్రూప్, ఆర్క్ డిజైన్‌తో అన్ని అన్ని సారూప్య ట్రేడ్‌మార్క్‌లు, సంబంధిత గ్రూప్ ఎంటీటీల నుంచి యాక్సిస్ బ్యాంక్ ద్వారా తాత్కాలికంగా లైసెన్సు క్రింద ఉపయోగించుకోవచ్చని సిటీ బ్యాంక్ తెలిపింది. అయితే ఈ మార్పుల నేపథ్యంలో వినియోగదారులు గమనించాల్సిన కొన్ని విషయాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

సిటీ బ్యాంకు కస్టమర్లు, కన్జ్యూమర్ బిజినెస్ కస్టమర్లు గుర్తుంచుకోవాల్సిన విషయాలివే

  • సిటీ మొబైల్ యాప్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఇప్పటికీ వినియోగదారులు యథావిధిగా వినియోగించుకోవచ్చు.
  • అన్ని సిటీ బ్రాంచ్‌లు యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్‌లుగా బ్రాండ్ చేస్తారు. అయితే ఖాతా సంఖ్య, ఐఎఫ్ఎస్సీ, ఎంఐసీఆర్ కోడ్‌లలో ఎటువంటి మార్పు ఉండదు.
  • సిటీ వినియోగదారులు తమ డెబిట్, ఏటీఎం, క్రెడిట్ కార్డ్‌లు, చెక్ బుక్‌లను సాధారణంగానే ఉపయోగించుకోవచ్చు.
  • క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు రెండింటిలో రివార్డ్ పాయింట్‌లు పొందుతారు. అలాగే వాటిని రిడీమ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. 
  • క్రెడిట్ కార్డ్‌ల ఫీజులు, ఛార్జీలు, బిల్లింగ్ సైకిల్, చెల్లింపు గడువు తేదీ, బిల్లు చెల్లింపు పద్ధతుల్లో ఎలాంటి మార్పు ఉండదు.
    లోన్ చెల్లింపులు, బిల్లు చెల్లింపులు లేదా ఏదైనా ఇతర ఖాతా బదిలీకి సంబంధించి అన్ని స్టాండింగ్ సూచనలు యథావిధిగా కొనసాగుతాయి.
  • సిటీ వినియోగదారుల పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలు కూడా ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతాయి.
  • సిటీతో తో డీమ్యాట్ ఖాతా కోసం ఖాతా నంబర్, డీపీ ఐడీ అలాగే ఉంటుంది. లావాదేవీల కోసం జారీ చేయబడిన డీఐ స్లిప్‌లు చెల్లుబాటు అవుతాయి.
  • సిటీ ద్వారా పొందే బీమా పాలసీల కోసం, పాలసీ నంబర్, ఉత్పత్తి లక్షణాలు, ప్రయోజనాలు, పునరుద్ధరణ తేదీలు ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతాయి.
  • సిటీ బ్యాంక్ తన ఐఆర్‌డీఏఐ లైసెన్స్‌ను సరెండర్ చేసింది. అందువల్ల బీమా పాలసీలకు సంబంధించిన అన్ని అభ్యర్థనలకు యాక్సిస్ బ్యాంక్ హాజరు అవుతుంది.
  • రుణాల కోసం, ఖాతా నంబర్, ఫీజులు, ఛార్జీలు, ఉత్పత్తి లక్షణాలు, రీపేమెంట్ విషయాల్లో కూడా ఎలాంటి మార్పులు ఉండవు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి