Prices: సిగరేట్ తాగేవారికి బిగ్ షాకింగ్ న్యూస్.. మరోసారి పెరగనున్న ధరలు..! మే నెలలోనే..

సిగరేట్ ధరలు మళ్లీ పెరగనున్నాయా.. ఫిబ్రవరి 1 నుంచి ధరలు పెరగ్గా.. రెండు నెలల తర్వాత ఇప్పుడు మళ్లీ పెరగనున్నాయని తెలుస్తోంది. దీనికి కారణం ధరలు పెరగడం వల్ల సేల్స్ తగ్గడమే కారణం. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ పెంచడంతో ఫిబ్రవరి నుంచి ధరలు పెరిగాయి.

Prices: సిగరేట్ తాగేవారికి బిగ్ షాకింగ్ న్యూస్.. మరోసారి పెరగనున్న ధరలు..! మే నెలలోనే..
Cigarette

Updated on: Apr 29, 2026 | 10:07 PM

సిగరేట్ తాగేవారికి మరోసారి షాక్ తగలనుంది. వీటి ధరలు మరోసారి పెరిగే అవకాశముందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ, ఎక్సైజ్ డ్యూటీ పెంచడంతో ఫిబ్రవరి 1 నుంచి ధరలు పెరిగాయి. దీంతో పొగవారి మరింత ఖర్చు అవుతుంది. అయితే మేలో సిగరేట్ ధరలు మరోసారి పెరగవచ్చని చెబుతున్నారు. దీనికి కారణం సేల్స్ తగ్గడమే. కేంద్రం జీఎస్టీ పెంచడంతో ధరలు పెరగడంతో సిగరేట్ తాగేవారు తగ్గిపోయారు. సేల్స్ తగ్గిపోవడంతో కంపెనీలకు నష్టాలు వస్తున్నాయి. దీనిని భర్తీ చేసుకునేందుకు ధరలను మరోసారి పెంచాలని కంపెనీలు భావిస్తున్నాయి.

16 శాతం పెరిగే అవకాశం

మేలో సిగరేట్ ధరలు 17 శాతం పెరగవచ్చని చెబుతున్నారు. దీంతో పొగతాగేవారి జేబుకు చిల్లులు పడనున్నాయి. కేంద్రం ఈ ఏడాది ఫిబ్రవరి 1 నంచి పొగాకు ఉత్పత్తులపై ఎక్సై్జ్ డ్యూటీని 30 నుంచి 40 శాతానికి పెంచింది. దీంతో కంపెనీలు సిగరేట్ ధరలను పెంచాల్సి వచ్చింది. దీని వల్ల సిగరేట్ అమ్మకాలు భారీగా తగ్గుముఖం పట్టాయి.  కింగ్ సైజ్  సిగరెట్ ధర రూ. 20 నుంచి రూ. 28కి పెరిగింది.  ప్రస్తుతం గోల్డ్ ప్లేక్ ప్రీమియం ప్యాక్ రూ.115గా ఉండగా.. రూ.135కి పెరగనుందని తెలుస్తోంది. మార్ల్‌బరో, గోల్డ్ ఫ్లేక్ కింగ్స్, క్లాసిక్ వంటి సిగరేట్ల ధరలు మళ్లీ పెరగనున్నాయి. ఇక ఇతర బ్రాండ్ల సిగరేట్ల ధరలు కూడా పెరిగే అవకావముందని తెలుస్తోంది.  సిగరేట్ ధరలు పెరిగితే.. తక్కువ ధర గల బ్రాండ్ల వైపు ప్రజలు మొగ్గు చూపవచ్చు. దీని వల్ల సిగరేట్ వినియోగం కూడా తగ్గే ఛాన్స్ ఉంది. తక్కువ ధర కలిగిన సిగరేట్ బ్రాండ్లకు డిమాండ్ పెరగనుంది. కంపెనీలు ధరలను పెంచి లాభాల కోసం చూస్తుండగా.. తాగేవారికి మాత్రం భారం పడనుంది. అయితే సిగరేట్ల ధరలు పెరగనున్నాయనే కారణంతో స్టాక్ మార్కెట్లో సిగరేట్ కంపెనీల షేర్లు పెరిగాయి. ఏప్రిల్ 29న ఐటీసీ షేర్ 4 శాతం పెరిగింది. గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్ షేర్ కూడా 6.5 శాతం పెరిగింది.

Follow Us