
Mobile Recharge Plan: ఇటీవల పార్లమెంటులో ఎంపీ రాఘవ్ చద్దా 28 రోజుల రీఛార్జ్ ప్లాన్‌ను విషయంపై పెద్ద దుమారం రేపడంతో ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది కుంభకోణం అంటూ ఎంపీ అభివర్ణించారు. ఒక సంవత్సరంలోని 12 నెలల కాలంలో మొబైల్ వినియోగదారులు 13 రీఛార్జ్‌లు చేయవలసి వస్తోందని ఆయన ఎత్తి చూపారు. ఈ సమస్యను పరిష్కరించడానికి 30 రోజుల వ్యాలిడిటీ వ్యవధితో ప్లాన్‌లను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది. బీఎస్ఎన్ఎల్ కూడా తన వినియోగదారులకు సౌకర్యాన్ని అందించడానికి చౌకైన 30 రోజుల రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.
BSNL కొత్తగా 30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది కేవలం రూ.225 ధరకే లభించే ఒక సరసమైన మొబైల్ ప్లాన్. BSNL రూ.255 కే 30 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. ఈ ప్లాన్‌లో రోజుకు అయ్యే ఖర్చు రూ.7.5. ఈ ప్లాన్ అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, ఈ 30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ వల్ల ప్రతి సంవత్సరం అదనపు రీఛార్జ్ చేయవలసిన భారం నుండి ప్రజలకు ఉపశమనం లభిస్తుంది.
ఇది కూడా చదవండి: రైతులకు బిగ్ అలర్ట్.. ఈ పనిని జూన్ 30లోగా చేయండి..!
ఈ ప్లాన్‌లో లభించే ఇతర ప్రయోజనాల విషయానికి వస్తే కంపెనీ ప్రతిరోజూ 2.5GB డేటాను అందిస్తోంది. ఈ డేటా రోజువారీ వ్యాలిడిటీతో వస్తుంది. అలాగే ప్రతిరోజూ అందుబాటులో ఉంటుంది. రోజుకు 2.5GB డేటా చొప్పున, వినియోగదారులు మొత్తం ప్లాన్‌లో 75GB డేటాను పొందుతారు. ఈ డేటా 4G వేగంతో వస్తుందని గమనించాలి. మీరు నివసించే ప్రాంతంలో జియో 5G లేదా ఎయిర్‌టెల్ 5G కంటే BSNL 4G నెట్‌వర్క్ మెరుగ్గా ఉంటే, ఈ ప్లాన్ మీకు ఉపయోగకరంగా ఉండవచ్చు.
ఇది కూడా చదవండి: Gas Cylinder: మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా? రూ.50 లక్షలు వస్తాయని మీకు తెలుసా..?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి